వామ్మో.. గుంటూరు కారం సినిమా పోస్టర్స్ వెనక ఇంత రహస్యం ఉందా..!?

Anilkumar
సాధారణంగా సినిమా పోస్టర్లను చూసి సినిమా కథ.. సినిమా ఎలా ఉండబోతుంది అని గెస్ చేస్తూ ఉంటారు. కానీ గుంటూరు కారం సినిమా విషయంలో మాత్రం అలా అస్సలు చేయొద్దని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే సినిమా పోస్టర్లను చూసి మోసపోవద్దు అని అంటున్నారు. దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది. సినిమా కథకు సినిమా నడిచే స్టైల్ కు సినిమా పాస్టర్ లకి చాలా డిఫరెన్స్ ఉంటుందట. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లను చూస్తే ఎక్కువగా మాస్ మూమెంట్స్ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి.

 ఇక ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లను చూస్తే.. వీటితో లుంగీలతో బీడీ తో కనిపిస్తూ ప్రేక్షకులని ఆ మూడ్ లోకి తీసుకు వెళ్లడానికి మాత్రమే అని అంటున్నాయి. ఇది ఒక మాస్ సినిమా అని నమ్మించి థియేటర్స్ లో మాత్రం క్లాస్ టచ్ ఉన్న మాస్ సినిమా లాగా చూపించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే మొదటి షెడ్యూల్లో మాత్రమే తీసిన ఫోటోలని విడుదల చేస్తున్నారు. అసలైన సినిమా కథకి సంబంధించిన పోస్టర్లను మాత్రం ఎక్కడా కూడా లీక్ చేయడం లేదు. అయితే మొదటి షెడ్యూల్లో ఒక ఫైట్ ని తీసారు. అక్కడితో ఆపేసి చాలా గ్యాప్ తర్వాత

మళ్లీ రీస్టార్ట్ చేశారు. ఇక అప్పుడు తీసిన షూటింగ్లో భాగంగా కొన్ని లుక్స్ ను పోస్టర్ల రూపంలో బయటపెట్టారు. రెండవ షెడ్యూల్లో తీసిన ఫోటోలని మాత్రం ఎక్కడా కూడా బయట పెట్టడం లేదు. గతంలో అలా వైకుంఠపురంలో సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఇటువంటి ప్లాన్ చేశాడు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి దసరాకి ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ రావాల్సింది. కానీ దాన్ని దీపావళి పోస్ట్ ఫోన్ చేశారు. తాజాగా మళ్లీ ఇప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ చేశారు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: