ఆ స్టార్ హీరోతో ఒక్కసారైనా నటించాలని ఉంది.. స్కంద హీరోయిన్ సాయి మంజ్రేకర్..!?

Anilkumar
2012లో ఒక మరాఠీ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సాయి మంజ్రేకర్. దాని తర్వాత బాలీవుడ్ లో ఏకంగా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ 3 సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక గత ఏడాది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గని సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది. అనంతరం గని సినిమా తర్వాత మేజర్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. తాజాగా ఇప్పుడు మళ్లీ

 స్కాంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో శ్రీకాంత్ కూతురిగా సెకండ్ హీరోయిన్ పాత్రలో మెరిసింది ఈ చిన్నది. ప్రస్తుతం రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దానితోపాటు టాలీవుడ్ లో కూడా ఏవైనా సినిమాలు చేస్తుందా అన్నది తెలియాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈమెకి సంబంధించిన ఒక వార్త  సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనికి

 సంబంధించిన ఎన్నో విషయాలని తన అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే తనకి ఎంతో ఇష్టమని.. జూనియర్ ఎన్టీఆర్కి ఎంతో పెద్ద ఫ్యాన్ అని.. ఆయనతో ఒక్కసారైనా కలిసి నటించాలి అన్నది నా లైఫ్ టైం కోరిక అని.. తన మనసులోనే మాటలను ఓపెన్గా బయటపెట్టింది ముద్దుగుమ్మ. దీంతో ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ యంగ్ బ్యూటీ కి జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: