సాధారణంగా పెద్ద బ్యానర్ లో సినిమా చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ కూడా మిస్ చేసుకోదు. అంతేకాదు హీరోయిన్లు సైతం స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక్కసారైనా ఒక్క సినిమా అయినా చేయాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ సహజనటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి మాత్రం ఒక సినిమాలో స్టార్ డైరెక్టర్ పిలిచి మరి అవకాశం ఇస్తే నేను చెయ్యను అని ఆ సినిమాని రిజెక్ట్ చేసింది. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి.
ఇక మొదటిగా పరిచయమైంది ఈటీవీలో ప్రసారమయ్యే డి డాన్స్ షో ద్వారా. ఈటీవీలో ప్రసారమయ్యే డి సీజన్ 4 లో సాయి పల్లవి కంటెస్టెంట్ గా పాల్గొని తన డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇక అప్పుడు ఆమెను టీవీలో చూసిన స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎలాగైనా సరే తనని నెక్స్ట్ సినిమాలో తీసుకోవాలి అని తనకోసం స్పెషల్ గా ఒక పాత్రని రాసుకొని మరి సినిమా చేయాలి అనుకున్నారు. ఇక ఇదే విషయాన్ని సాయి పల్లవి తల్లి నంబర్ తెలుసుకొని ఆమెకి ఫోన్ చేసి మరీ మీ కూతుర్ని నా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్గా తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పారట.
ఈ విషయం తెలియగానే సాయి పల్లవి మాత్రం నేను ఇప్పుడే సినిమాల్లోకి రాను నా చదువు పూర్తయిన తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని చెప్పిందట. దాంతో శేఖర్ కమ్ముల సైలెంట్ అయిపోయాడు. శేఖర్ కమ్ముల తన లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమాలో సాయి పల్లవి కోసం ఒక పాత్రని అనుకున్నాడట. కానీ అది జరగలేదు. ఈమెకు మలయాళ ప్రేమ. సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కూడా నేను ప్రస్తుతం జార్జియాలో నా చదువులో కొనసాగిస్తున్నాను అది పూర్తయ్యేసరికి ఆరు నెలల సమయం పడుతుంది దాని తర్వాత సినిమా చేస్తాను అని ఆ డైరెక్టర్ కి చెప్పింది. ఇక అలా చదువు పూర్తయిన తర్వాత ప్రేమమ్ సినిమాతో మలయాళం లోకి ఎంట్రీ ఇచ్చింది. దాంతోపాటు ఎలాగైనా శేఖర్ కమలా తన సినిమాలో సాయి పల్లవిని పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తరువాత ఆయన దర్శకత్వంలో ఫిదా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది..!!