బాలయ్య,నాని లతో మల్టీ స్టార్ మూవీ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్.. ఎప్పుడంటే..!?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది అని చెప్పాలి. సీనియర్ హీరో వ్యక్తి వెంకటేష్ ఎప్పటినుండో మల్టీస్టారర్ సినిమా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు. అలా ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిచారు. ఈ నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ మరియు మరొక కుర్ర హీరో తో సినిమా చేయాలి అన్న ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దానికి అందరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అని అంటున్నారు .ఇక ఆ స్టార్ హీరో మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని నాచురల్ స్టార్ నాని.

నాని  మరియు బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇంకా చెప్పాలి అంటే బాలయ్య అంటే నానికి ఎంతో ప్రేమ అభిమానం ఇష్టం కూడా. బాలయ్య శ్రీరామరాజ్యం సినిమా కు అప్పటికే హీరోగా ఉన్న  నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పని కూడా చేశాడు. దానితోపాటు నాని తన సినిమాలో బాలయ్య అభిమానిగా కూడా నటించారు. బాలయ్య టాక్ షోకి గెస్ట్ గా కూడా ఆయన రావడం జరిగింది. దాంతోపాటు ఎప్పటికప్పుడు బాలయ్య పై తన అభిమానాన్ని చూపిస్తూనే ఉంటాడు నాని. ఇక అలా నందమూరి అభిమానులు నాని చాలా ఇష్టపడతారు . ఈ నేపద్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టార్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అని రావిపూడి.

ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు అనిల్. కాగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే బాలయ్య మరియు నాని మల్టీస్టారర్ కథ ఉండడంతో తన మదిలో ఉన్న విషయాన్ని బాలయ్య కి మెయిన్ లైన్ రూపంలో చెప్పారట. అనంతరం అది విన్న బాలయ్య నువ్వు ఎప్పుడైనా కథ రెడీ చేసుకుని నేను ఆ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ అనిల్ కి హామీ ఇచ్చాడట. నాని మాత్రం బాలయ్యతో సినిమా అంటే ఎందుకు కాదని అంటాడు అలా ఈ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: