టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ మరియు డిజె ఫెమ్ హీరోయిన్ జంటగా నటించిన తాజా సినిమా బెదురులంక 2012. యుగాంతం నేపథ్యంలో ఒక పల్లెటూరులో జరిగిన సంఘటనల ఆధారంగా డైరెక్టర్ క్లాక్స్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఎటువంటి అంచనాలు లేకుండా ఆగస్టు 25న విడుదలై ఉన్న బెదురులంక 2012 సినిమా మొదటి షో నుండి ఊహించని విధంగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని దూసుకుపోయింది. దాంతోపాటు ఊహించిని దానికంటే బెస్ట్ గా హిట్ అయింది. ఇక దానికి తోడుగా పోటీగా రిలీజ్ అయిన వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున సినిమా
బాయ్స్ హాస్టల్స్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు బెదురులంక సినిమాకి అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కామెడీ అత్యద్భుతంగా ఉంది అని అంతర్లీనంగా ఓ సన్నివేశాన్ని కూడా ఇచ్చారు అంటూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు ఈ యంగ్ హీరో. ఇక బెదురులంక సినిమాతో ఆ లోటు తీరిపోయింది అని తెగ ఖుషి అవుతున్నారు. ఆయన అభిమానులు ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధిస్తుండడంతో చిత్ర బృందం ఒక రేంజ్ లో ఖుషి అవుతున్నారు.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ఈ సూపర్ హిట్ మూవీ కద మొదటిగా ఒక యంగ్ హీరో దగ్గరికి వెళ్లిందట. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సినిమాని అయింది హీరో రిజెక్ట్ చేశారట. ఇక ఆ యంగ్ హీరో మరెవరో కాదు ఇటీవల రంగబలి సినిమాతో ఆకట్టుకున్న నాగశౌర్య. దర్శకుడు ఈ సినిమా కథను ముందుగా నాగశౌర్యకి వినిపించాడట. కద బాగా నచ్చడంతో నాగశౌర్య వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. సుమారు రెండు ఏళ్ల పాటు ఈ సినిమా గురించి ట్రావెల్ కూడా చేశారట .కానీ ఏమైందో తెలియదు కానీ నాగశౌర్య ఈ సినిమా నుండి బయటకు వచ్చేసాడు. కాగా ఇప్పుడిప్పుడు హీరోగా రాణిస్తున్న కార్తికేయకు ఈ సినిమాతో మరొక హిట్ పడింది..!!