మిస్టేక్ మూవీ రివ్యూ.. భయపెట్టిన అభినవ్ సర్దార్

Anilkumar
కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలెప్పుడూ జనాల నుంచి రెస్పాన్స్ దక్కించుకుంటాయి. ఒక్క మనిషి చుట్టో, ఒక వస్తువు చుట్టో సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తిప్పడం అంటే మామూలు విషయం కాదు. స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్‌గా ఉండాల్సి వస్తుంది. అలాంటి ఓ సినిమానే అభినవ్ సర్దార్ నటిస్తూ నిర్మించాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వ‌హించారు. ఈ వారం ఈ సినిమా థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటో ఓ సారి చూద్దాం.
కథ
అగస్త్య (బిగ్ బాస్ అజయ్ కతుర్వార్), కార్తీక్ (తేజ ఐనంపూడి), దేవ్ (సుజిత్ కుమార్) ముగ్గురు స్నేహితులు. ఒకే రూంలో ఉంటారు. ఈ ముగ్గురూ ప్రేమలో ఉంటారు. ఆ ముగ్గురూ మిత్ర (ప్రియ), స్వీటీ (తానియ కల్ల్రా), పారు (నయన్ సారిక) ఈ ముగ్గురితో ప్రేమలో పడతారు. వీరి ప్రేమ సాఫీగానే సాగుతున్న టైంలో ఒక్కో జంటకు ఒక్కో రకమైన కష్టం వస్తుంది. ఈ కష్టాల నుంచి తప్పించుకునేందుకు టూర్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. అక్కడ ఈ మూడు జంటలకు ఎదురైన పరిస్థితులు ఎంటి? ఆ మూడు జంటలను వెతుక్కుంటూ వచ్చిన మనిషి (అభినవ్ సర్దార్) ఎవరు? ఆ వ్యక్తికి వీరితో పని ఏంటి? ఈ కథలో రాజా రవీంద్ర, సమీర్ పాత్రల నేపథ్యం ఏంటి? అన్నదే కథ.
నటీనటులు
అగస్త్య పాత్రలో బిగ్ బాస్ అజయ్, కార్తీక్‌గా తేజ ఐనంపూడి, దేవ్ కారెక్టర్లో సుజిత్ కుమార్ చక్కగా నటించారు. కామెడీ, యాక్షన్ ఇలా ప్రతీ సీన్‌లో మెప్పిస్తారు. ఇక హీరోయిన్లుగా నటించిన ప్రియ, తానియ, నయన్ ముగ్గురూ అందంగా కనిపించారు. తెరపై మూడు జంటలు బాగానే సందడి చేశాయి. విలన్‌గా కనిపించిన అభినవ్ సర్దార్ మాత్రం అందరినీ భయపెట్టేస్తాడు. యాక్షన్ సీక్వెన్సులు అదరగొట్టేశాడు. విలనిజం చూపించడంలో అభినమ్ వంద మార్కులు కొట్టేస్తాడు. రాజా రవీంద్ర, సమీర్‌లు తమ అనుభవాన్ని చూపించేలా నటించారు. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.

విశ్లేషణ
ఒక పాయింట్ చుట్టూ కథను తిప్పడం మామూలు విషయం కాదు. ఎక్కడిక్కడ పకడ్బంధీగా స్క్రిప్ట్‌లో ట్విస్టులు ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఈ సినిమాలో డైరెక్టర్ భరత్ మ్యాజిక్ చేశాడు. ఇంటర్వెల్ వరకు ఒక సినిమా అనిపిస్తుంది.. ఇంటర్వెల్‌లో ఇచ్చిన ట్విస్టుకు అంతా షాక్ అవుతారు. అప్పటి వరకు సినిమాను నార్మల్ ఫేజ్‌లో పట్టుకెళ్లినట్టు అనిపిస్తుంది. మూడు జంటలతో కామెడీ, బస్తీ వాతావరణం, లవ్ సీన్లు, కామెడీ సన్నివేశాలు, పాటలతో అలా మెల్లిగా లాగించాడు. క్లైమాక్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు దర్శకుడు.
ఇక ద్వితీయార్థంలో చకచకా పరుగులు పెట్టినట్టు అనిపిస్తుంది. వారు వెతికేది దొరకదు.. ఎక్కడుందో తెలియదు.. ప్రాణాలను ఎప్పుడు తీసేస్తారో తెలియదు.. ఇలా సెకండాఫ్ మొత్తం ఎంతో గ్రిప్పింగ్‌గా సాగుతుంది. వీటన్నంటి మధ్యలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులను రాసుకున్నాడు దర్శకుడు. ఇలా ప్రేక్షకుడు ఆసాంతం ఎంజాయ్ చేసేలా కథ, కథనాలు పేర్చుకున్నాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్టులు మరింతగా షాక్‌కు గురి చేస్తాయి. అలా చివరకు ప్రేక్షకులు మాత్రం ఫుల్లుగా సంతృప్తితో బయటకు వస్తారు.
సాంకేతికంగానూ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఫారెస్ట్ లొకేషన్లను అందంగా చిత్రీకరించారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. మాటలు నవ్విస్తాయి. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాత కష్టం తెరపైనా కనిపిస్తుంది. నిర్మాత అభినవ్ పెట్టిన ఖర్చు, యాక్షన్ సీక్వెన్సుల్లో పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ 3

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: