తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ లకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేకపోయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లుగా ఇద్దరు హీరోలు చాలాసార్లు తమ సినిమాలతో పోటీ పడిన సంగతి తెలిసిందే .ఇప్పటికీ పోటీ పడుతూనే ఉంటారు. దీంతో సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నాళ్ల నుండి మెగాస్టార్ చిరంజీవి మరియు బాలయ్య కొంచెం తేడాగా వ్యవహరిస్తున్నారు.
ఒకప్పుడు మాత్రం చాలా సున్నితంగా వీరిద్దరూ ఉండేవారు. గతంలో వీరిద్దరూ కలిసి ఒక మల్టీస్టారియర్స్ సినిమాని చేయాలని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా నుండి చిరంజీవి తప్పుకున్నాడు. అయితే ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్లో మిస్ అయిన సినిమా మరేదో కాదు అపూర్వ సహోదరులు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు .విజయశాంతి భానుప్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. 1986 అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. '
అయితే నిజానికి ఈ సినిమాని మొదట ఒక మల్టీ స్టారర్ సినిమాగా ప్రకటించారు చిత్ర బృందం. కాగా ఈ సినిమాలో చిరంజీవి మరియు బాలకృష్ణ లను హీరోలుగా ఎంపిక చేయడం జరిగింది. దాంతోపాటు కొంత ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేశారు చిత్ర బృందం. కానీ ఏమైందో తెలియదు గానీ ఒక్కసారిగా చిరంజీవి ఈ సినిమా నుండి తప్పుకున్నారు. దాంతో చిరంజీవి క్యారెక్టర్ కూడా బాలకృష్ణ చేశారు .దాంతో ఈ సినిమా ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది .అలా వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా మిస్ అయింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వచ్చి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అంటున్నారు ఈ వార్త విన్న నందమూరి మెగా అభిమానులు..!!