టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది తమన్నా. దానితోపాటు బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమాయణం కూడా నడుపుతోంది. ఇక ఈ వార్తల్లో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం చాలా బిజీగా మారింది తమన్నా.
అయితే ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్న మెగాస్టార్ చిరంజీవి మరియు మెహర్ రమేష్ కాంబినేషన్లో రాబోతున్న భోళాశంకర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కావడానికి రెడీగా ఉంది. అయితే ఈ సినిమా విడుదల కాబోతున్న క్రమంలో పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు చిత్ర బృందం. దీంతో ఈ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది తమన్నా. ఇంటర్వ్యూలలో భాగంగా హైపర్ ఆది తమన్నాను ప్రశ్నిస్తూ టాలీవుడ్ హీరోల గురించి ఒక్కమాటలో సమాధానం చెప్పాలి అని అన్నారు..
ఇక తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోలతో కలిసి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమన్న టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ చిరంజీవి చాలా అల్లు అర్జున్ స్టైలిష్ పర్సన్ మహేష్ బాబు చాలా అందగాడు ఎన్టీఆర్ ఆల్ రౌండ్ పవన్ కళ్యాణ్ వెరీ మాస్ హీరో ప్రభాస్ అందరి డార్లింగ్ అంటూ టాలీవుడ్ హీరోల గురించి ఒక్కమాటలో చెప్పింది. దీంతో మిల్కీ బ్యూటీ తమన్న టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!