ఆనంద్ దేవరకొండ 'బేబీ' మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే.. అన్ని రోజుల తర్వాతే స్ట్రీమింగ్ ..?

Anilkumar
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'బేబీ'. కొబ్బరిమట్ట, హృదయ కాలేయం వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. విరాజ్ అశ్విన్,    నాగబాబు, లిరిష, సాత్విక్ ఆనంద్, బబ్లు, మౌనిక, కీర్తన, సీత ఇతర కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ పతాకం పై యువ నిర్మాత ఎస్ కే ఎన్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అవ్వగా.. జూలై 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా దర్శకుడు సాయి రాజేష్ ఈ జనరేషన్ యూత్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని తెరకెక్కించారు. ఇప్పటి యూత్ ఎంతో ఈజీగా ప్రేమలో పడుతున్నారు. కానీ ఆ ప్రేమను కేవలం ఒకరికే పంచకుండా ఒకరికి తెలియకుండా వేరొకరితో రిలేషన్ లో ఉంటూ తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే కాన్సెప్ట్ తో యూత్ కి కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేశారు. దీంతో ప్రస్తుతం బేబీ మూవీ కి థియేటర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి తరుణంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్, ఓటీటీ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

ఫిలిం సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'బేబీ' మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ 'ఆహా' ఓటీటీ కోసం ఏకంగా 8 కోట్లు పెట్టి కొనుగోలు చేశారట. ఓ చిన్న సినిమాని అల్లు అరవింద్ భారీ రేటుకు దక్కించుకోవడం గమనార్హం. నిజానికి విడుదలకు ముందే అరవింద్ ఈ సినిమా ఓటిటి రైట్స్ కొనేసారట. సినిమాపై ఆయనకు నమ్మకం ఉండడంతో ఆ రేంజ్ లో ఖర్చు చేశారని అంటున్నారు. కాగా ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో 'ఆహా' ఓటీటీలో రానున్నట్లు తెలుస్తోంది. ఇక బేబీ మూవీ కి కేవలం డిజిటల్ రైట్స్ కోసమే 8 కోట్ల డీల్ ఓకే అవ్వడంతో చిత్ర నిర్మాతలు సైతం మూవీ సక్సెస్ పై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అంతేకాదు రిలీజ్ కు ముందే డిజిటల్ రైట్స్ ద్వారా బేబీ మూవీ నిర్మాతలకు లాభాలు వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: