రిలీజ్ కు ముందే బ్రో సినిమాకు ఊహించని షాక్..!!
బ్రో సినిమా సాంగ్స్, టీజర్ సోషల్ మీడియాలో బాగానే పాపులర్ అయినప్పటికీ ఈ మధ్యకాలంలో హడావిడి కాస్త తక్కువ అయిందని చెప్పవచ్చు.అయితే అందుకు కారణం ఇటీవలే పవన్ కళ్యాణ్ గ్రామ వాలంటరీ వ్యవస్థ పైన మాట్లాడడం జరిగింది ఈ విషయం పైన నెగిటివ్గా కూడా పవన్ కళ్యాణ్ పైన స్ప్రెడ్ కావడంతో బ్రో సినిమా కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు సైతం ముందుకు రాలేకపోతున్నట్లు వార్త వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతలు ఇప్పుడు సొంతంగా విడుదల చేయాలనే ఆలోచనలో లేకుండా డిస్టిబ్యూటర్లకే ఎంతోకొంతకి ఇచ్చేయాలని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పటివరకు పెద్దగా ఈ బ్రో సినిమా వైపు మగ్గు చూపడం లేదట.ముఖ్యంగా థియేటర్ యజమానులు విడుదల రోజు పరిస్థితుల గురించి కూడా చాలా ఆందోళన చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి రో సినిమా పరిస్థితి ఏంటా అంటూ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నంత స్పీడు ఇప్పుడు కనిపించడం లేదని కేవలం ఈ సినిమా విడుదల సమయం మరి కొద్ది రోజులు మాత్రమే ఉన్న జోరు కనిపించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి కూడా ఎటువంటి సమాచారం రాలేదు.