టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కావ్య కళ్యాణ్ రామ్ గురించి చెప్పనవసరం లేదు. గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈమె. దాని తర్వాత ఠాకూర్ బన్నీ అడవి రాముడు వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది కావ్య కళ్యాణ్. ఇప్పుడు హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటిస్తోంది అని చెప్పాలి. అయితే తాజాగా తనపై వస్తున్న ఒక రూమర్ పై క్లారిటీ ఇచ్చింది ఆమె. అయితే ఇటీవల ఆమె బలగం సినిమా లో నటించిన విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు వరుస సినిమాలు
చేస్తూ బిజీగా ఉన్న ఈమె ఈ సినిమా కంటే ముందు ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే బలగం సినిమాతో మాత్రం హీరోయిన్ గా ఊహించని క్రేజ్ నువ్వు సొంతం చేసుకుంది ఈమె. ప్రస్తుతం ఈమె శ్రీ సింహ హీరోగా వస్తున్న వస్తాదా సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలలో పలు ఇంటర్వ్యూలో పాల్గొంటుంది కావ్య. ఈ క్రమంలోనే బాడీ షేమింగ్గ్ పైన మాట్లాడినట్లుగా చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే ఒక సినిమా ఆడియో ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు దర్శక నిర్మాతలు తన పైన బాడీ షేమింగ్ చేశారంటూ పేర్కొంది
అంటూ చాలా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆమె స్పష్టం చేస్తూ తాను అలా ఏ ఇంటర్వ్యూలలో కూడా తప్పుగా మాట్లాడలేదని కేవలం తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అయితే తన సోషల్ మీడియా వేదిక ఈ విధంగా చెప్పుకొచ్చింది కొన్ని వెబ్సైట్లో కొంతమంది దర్శకులు బాడీ షేమింగ్ చేసినట్లుగా సంబంధమైన అసత్యమైన ప్రకటనలు చేస్తున్నారని అది నేను గమనించాను అని ఇలాంటి విషయాలు నేనెప్పుడూ చెప్పలేదు అని ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయవద్దు అంటూ మీడియాకు విజ్ఞప్తి చేసింది కావ్య..!!