టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ క్రమంలోని స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది పాటు సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకోబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. సిటాడిల్ మరియు ఖుషి సినిమాల షూటింగ్స్ పూర్తయిన తర్వాత మాత్రమే సమంతా సినిమాలకి లాంగ్ బ్రేక్ తీసుకోబోతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రెండూ కూడా గత సంవత్సరమే పూర్తి కావలసిన సినిమాలు.
కానీ సమంత ఆ సమయంలో మయూసైటిస్ అనారోగ్యం సమస్యల కారణంగా ఈ షూటింగ్స్ వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఖుషి సినిమా షూటింగ్ సమంత పూర్తి చేసిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే అదే సమయంలో బాలీవుడ్ లో సమంత చేస్తున్న సీట్ టైటిల్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత ఈ రెండు సినిమాల ప్రమోషన్స్ లకు హాజరవుతుందా లేదంటే ఆ ప్రమోషన్స్ కార్యక్రమాలకు దూరంగా ఉంటుందా అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ మధ్య యశోద సినిమాకి కూడా తప్పని పరిస్థితుల్లో సమంతా ప్రమోషన్స్ కి హాజరు కావలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల విషయంలో సమంత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే సమంత నటించిన ఈ రెండు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సినీ లవర్స్ అంటున్నారు. అయితే సమంత మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో వీరిద్దరి లుక్స్ మరియు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అంటున్నారు. దాంతో పాటు సీట్ ఆడిల్ సిరీస్ సైతం సమంతకు మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఇక అందులో సమంత యాక్టింగ్ ఈ ఫిదా అవ్వడం ఖాయమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..!!