బ్రో మూవీ నైజాం హక్కులు ఎన్ని కోట్లో తెలుసా..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న బ్రో సినిమా త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మరో నాలుగు వారాలలో విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులు కళ్ళు చెదిరే ధరకి అమ్ముడుపోయాయన్న సమాచారం  వినపడుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బ్రో సినిమా నైజాం హక్కులు ఏకంగా 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ 

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్లే ఈ సినిమా హక్కులు ఈ స్థాయిలో అమ్ముడైన సమాచారం వినబడుతుంది. అయితే ఈ సినిమాకి థియేటర్ హక్కుల ద్వారా 120 కోట్ల రూపాయల నుండి 130 కోట్ల రూపాయల రేంజ్ లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.నిన్న విడుదలైన టీజర్ ఎంతటి రెస్పాన్స్ ను కనబరిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక టీజర్ తో ప్రమోషన్స్ కార్యక్రమాన్ని సైతం మొదలుపెట్టారు. కాగా త్వరలోనే అంటే మరో రెండు వారాలు ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయనన్నారు మేకర్స్. అయితే ఏపీలో ఈ సినిమా పేరు రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరగబోతుంది అని తెలుస్తోంది.

దీంతో ఈ సినిమా అంచనాలు రెట్టింపు కావడం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ విషయం తెలిసి బ్రో, సినిమా నైజాం హక్కులకు ఇంత డిమాండ్ వస్తుంది అని తెలిసిన నెటిజన్స్ ఈ సినిమా పై చాలా పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అందుకుంటాడని అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. దాంతోపాటు సాయిధరమ్ తేజ్ సైతం ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలని కోరుకుంటున్నారు తమ ఫ్యాన్స్. అయితే సాయిధరమ్ తేజ్ సైతం బ్రో సినిమాతో 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న హీరోల లిస్టులో చేరాలని  కామెంట్స్ పెడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: