నిఖిల్ 'స్పై' వచ్చేది ఆ ఓటీటీలోనే..?

Anilkumar
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన తాజా చిత్రం 'స్పై'(Spy). సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్ కి డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి, చరణ్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించింది. మకరంద్ దేశ్పాండే, ఆర్యన్ రాజేష్, సానియా ఠాగూర్, అభినవ్ గోమటం తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

కార్తికేయ2 వంటి ఫ్యాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల నడుమ జూన్ 29న (ఈరోజు) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ ని అందుకుంది. అంతేకాకుండా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా అందుకునే అవకాశాలు గట్టిగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే 'స్పై' మూవీ కి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. విడుదలకు ముందే 'స్పై' మూవీ డిజిటల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్స్ ప్రకారం 'స్పై' మూవీ ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ని అగ్ర ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు తో కలిపి మొత్తం ఐదు భాషల్లో ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యేలా స్పై నిర్మాతలు అమెజాన్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం జూన్ 29న విడుదలైన 'స్పై' ఆగస్టు మూడో వారంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. కాగా నిఖిల్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూర్చగా.. శ్రీ చరణ్ పాకాల నేపధ్య సంగీతం అందించారు. కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని నిర్మించడమే కాకుండా స్క్రిప్ట్ కూడా అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: