ధనవంతుల పిల్లలతోపాటు పేద విద్యార్థులు కూడా వారికి పోటీపడుతూ చదవాలని అంటుంది ప్రముఖ నటి మంచు లక్ష్మి. అంతేకాదు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి ప్రైవేటు విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్ భాషలో రాయడం మాట్లాడడం రావాలి అంటూ పేర్కొంది. అంతేకాదు ఇదే లక్ష్యంతో టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది మంచు లక్ష్మి. అయితే ఈ నేపథ్యంలోనే బుధవారం మంచు లక్ష్మి జోగులాంబ గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసింది. ఆమెతో చాలాసేపు మాట్లాడింది మంచు లక్ష్మి.
అంతే కాదు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ గద్వాల్ చేనేత చీరలకు ప్రసిద్ధి అంటూ పేర్కొంది.అంతేకాదు ఈ జిల్లా నుండి వచ్చిన విద్యార్థులను మంచి విద్యార్థులుగా తయారు చేస్తామంటూ ప్రకటించింది. ఇక తమ సంస్థ ఆధ్వర్యంలో గత ఏడాది యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 56 పాఠశాలల్లో టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమం అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయని చెప్పుకొచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి సంవత్సరం కొన్ని జిల్లాలను ఎంపిక చేసుకొని డిజిటల్ విద్యను అందిస్తామంటూ తెలిపింది మంచు లక్ష్మి.
అయితే అందుకే ఈసారి 30 స్కూల్స్ ను ఆమె జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి సెలెక్ట్ చేసినట్లుగా ప్రకటించింది.ఈ కార్యక్రమం ద్వారా ఆమె విద్య బోధనా మూడు స్థాయిలో జరుగుతుందని ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ భాషలో బోధన ఉంటుందని చెప్పుకొచ్చింది. అందులో టీవీ వాల్ పెయింటింగ్ కార్పెట్స్ బోధన సామాగ్రి సమకూరుస్తామంటూ చెప్పుకొచ్చింది. 30 పాఠశాలలో వసతులను అన్ని కల్పించినట్లుగా అగ్రిమెంట్ పై సంతకం కూడా చేసింది ఆమె. దీంతో మంచు లక్ష్మి చేసిన ఈ మంచి పనికిగాను ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!!