చిరంజీవి,త్రిషల మధ్య విభేదాలు.. అదే కారణమా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవి సినిమాలతో చాలామంది దర్శక నిర్మాతలు నటీనటులు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతేకాదు చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు నటీనటులు సైతం కోరుకుంటారు. అయితే హీరోయిన్ త్రిష కూడా అటు టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు హీరోయిన్ త్రిష మరియు చిరంజీవి కాంబినేషన్లో ఒక సరికొత్త సినిమా రాబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి దాదాపు 17 సంవత్సరాలు కావస్తోంది. తాజాగా ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరొక కొత్త సినిమా రాబోతోంది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే సాధారణంగా హీరోయిన్ ల కెరియర్ విషయానికి వస్తే చాలా తక్కువ సమయంలోనే ఫెడ్ అవుట్ అయిన హీరోయిన్స్ ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ త్రిష అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ అదే అందంతో అదే ఫిట్నెస్ తో తన కెరియర్ను కొనసాగిస్తుంది త్రిష.

ఇక కెరియర్ మొదట్లో ఆమె తమిళం కన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు టాలీవుడ్ లో ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు సెనసన నటించిన ఈమె ఇక 17 సంవత్సరాల క్రితం స్టాలిన్ సినిమాలో చిరంజీవితో జత కట్టింది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది .దాని తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. దాని తర్వాత ఆచార్య సినిమాలో హీరోయిన్గా త్రిషని అనుకున్నారు. ఇక అదే సమయంలో చిరంజీవి త్రిష మధ్య రమ్యునరేషన్ విషయంలో మనస్పర్ధలు వచ్చాయట. ఇక అప్పటి నుండి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది అన్న వార్తలు వినిపించాయి. దాంతో ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: