ఎన్టీఆర్ పై కోపం పెంచుకున్న బాలకృష్ణ అసలు కారణం ఏంటో తెలుసా..!?

Anilkumar
ఈ మధ్యకాలంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ఏదో ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడానికి ముఖ్య కారణం బాలకృష్ణనే అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే దానికి ముఖ్య కారణం బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని దూరంగా పెట్టడం వల్లనే జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అన్న వార్తలు ఎంతలా వచ్చాయో మనందరికీ తెలిసిందే. మొదట్లో నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ని దగ్గరికి రానివ్వలేదట .

దాని తరువాత జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో గా మారాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న తర్వాత ఆయనని దగ్గరికి తీసుకున్నాడు బాలకృష్ణ .ఇక అలాంటి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.. జూనియర్ ఎన్టీఆర్ మొదటిలో ఒక హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాడట. అదే సమయంలో హరికృష్ణ కలుగజేసుకొని ఎన్టీఆర్ కి ఆ హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చి ఇద్దరినీ దూరం పెట్టాడట. దాని తర్వాత ఎన్టీఆర్ కి మంచి సంబంధం చూడమని చంద్రబాబు నాయుడుకి చెప్పాడట హరికృష్ణ.

అప్పుడు తన మేనకోడలు కూతురు లక్ష్మీ ప్రణతిని ఇచ్చి జూనియర్ ఎన్టీఆర్కి పెళ్లి చేశాడు హరికృష్ణ. అయితే పెళ్ళికి ముందు జూనియర్ ఎన్టీఆర్ టిడిపి తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. అలా ప్రచారం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కి గాయాలు అయ్యాయి. చావు బతుకుల నుండి బయటపడ్డ జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల వైపు వెళ్లలేదు .అనంతరం 2011లో చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురుతో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి జరిగింది. అనంతరం టిడిపి పార్టీ తరపున వచ్చిన ప్రచారానికి రమ్మని బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్ని అడిగారట. కానీ ఆయన సినిమాల్లో బిజీగా ఉండడంతో ఎన్నికల ప్రచారానికి రావడం కుదరదు అని చెప్పాడు. దాంతో అప్పటినుండి జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: