ఆది పురుష్ సీత పాత్రను వదులుకున్న హీరోయిన్..!!

Divya
టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. అయితే ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించింది.. ఈ సినిమాలో సీత పాత్ర కోసం మొదట ఒక స్టార్ హీరోయిన్ ని అనుకున్నారట ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

త్రీడీ లో అదిపురుష్  చిత్రాన్ని తెరకెక్కించారు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇప్పటికీ ఇండియన్ సినిమాలలో లేనివిధంగా అద్భుతంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రశంశాల వర్షం కురిపించే విధంగా కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడు పాత్రలో అద్భుతంగా నటించారని కృతి సనన్ సీత పాత్రలో కనుల విందుగా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరో రెండు తరాల వరకు సీత అంటే  కృతి సనన్ అనిపించే విధంగా అద్భుతంగా నటించిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మొదట ఈ పాత్రకు డైరెక్టర్ ఓం రౌత్ దీపికా పదుకొనేని సెలెక్ట్ చేయాలని నిర్ణయించారట.

డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో చాలా రోజులు ఎదురు చూసిన డైరెక్టర్ ఈమెకు నటించాలని కోరిక ఉన్నప్పటికీ డేట్లు అడ్జస్ట్ కాలేకపోవడంతో ఈ పాత్రని మరొక హీరోయిన్ కి సూట్ అయ్యే విధంగా లిస్టు తీయగా అందులో కృతి సనన్ సెలెక్ట్ చేసి తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో దీపిక పదుకొనే పద్మావత్ అనే చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించింది.. ఆ సినిమా తర్వాత మళ్లీ అంతటి పాపులారిటీ ఉన్న పాత్ర సీత పాత్ర కావడంతో  ఆమెకు కథ చెప్పగా నచ్చిందట కానీ డేట్ లో అడ్జస్ట్ కాలేకపోవడంతో ఈ పాత్రను వదిలేయవలసి వచ్చింది. లుక్ టెస్ట్ చేసిన తర్వాత చివరికి కృతి సనన్ సెట్ చేయడం జరిగింది డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: