OG: పవన్ ని ఢీకొట్టే పాత్రలో స్టార్ హీరో..!!
గత కొద్ది రోజుల క్రితం శ్రియ రెడ్డిని కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం సుజిత్ కన్ఫామ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియ అరుణ్ మోహన్ హీరోయిన్ గా ఈ మూవీలో పవన్ కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మిన్ ఈ చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
చివరిగా ఇమ్రాన్ హస్మి అక్షయ్ కుమార్ నటించిన సెల్ఫీ సినిమాలో నటించారు ఇప్పుడు ఓ జి సినిమాతో మళ్లీ పవన్ కళ్యాణ్ కి ప్రతి నాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది చిత్ర బృందం. అలాగే ఒజీలో స్టీల్ తో తన పోస్టర్ను కూడిన ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. బాలీవుడ్ స్టార్ ఈ చిత్రంలో భాగం కావడంతో ఈ సినిమాకు మరింత హైట్ ఏర్పడుతోంది అన్ని భాషలకు చెందిన నటీనటులను సైతం ఈ సినిమా కోసం ఎంచుకోవడంతో సుజిత్ ఎంపిక కరెక్టేనా అంటూ అభిమానులు అయోమయంలో పడ్డారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.