ఆ ప్లేస్ లో ప్రభాస్ ని తప్ప మరెవరిని ఊహించుకోలేను.. షాకింగ్ కామెంట్స్ చేసిన కృతి సనన్..!?

Anilkumar
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం అయింది ఈమె. దాని తర్వాత నాగచైతన్య సరసన సినిమాలో కూడా నటించి అలరించింది. కాగా గత ఏడాది వరుణ్ ధావన్ తో కలిసి భేడియా సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్గా నటిస్తోంది కృతి.  ఇక వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 16న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

 బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అయితే గతంలో ప్రభాస్తో ఈమె డేటింగ్ లో ఉందంటూ చాలా రకాల రూమర్స్ వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది .ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మొదటిసారిగా ప్రభాస్ తో కలిసి నటించిన ఎలా ఉంది అంటూ ఈమెని  అడగగా

ఊహించిన సమాధానాన్ని ఇచ్చింది ఈమె. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ప్రభాస్ చాలా ప్రశాంతంగా ఉంటాడు.. ఎదుటివారిని చాలా గౌరవిస్తారు మొదట్లో చాలా సిగ్గుపడేవాడు.. అనంతరం నేను నటించిన తెలుగు సినిమా గురించి ఆయన దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేశాను.. మనకు రాని భాషలు నటించడం చాలా కష్టమని నేను చెప్పాను.. దాని తర్వాత ప్రభాస్ నేను మామూలుగానే మాట్లాడేదాన్ని.. కానీ ప్రభాస్ నా దగ్గర చాలా ఓపెన్ గా ఉండేవాడు.. చాలా సైలెంట్ గా తన పని తను చేసుకుంటాడు.. అంతే కాదు తన కళ్ళతోనే భావాలను వ్యక్తపరుస్తాడు ప్రభాస్... అంతే కాదు ఆది పురుష్ సినిమాలో రాఘవగా ప్రభాస్ ని తప్ప నేను మరొకరిని ఊహించుకోలేను అంటూ చెప్పుకొచ్చింది కృతి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: