మార్పులతో ఓటీటి లోకి వస్తున్న అఖిల్ ఏజెంట్..!!
అయితే ఓటిటి విడుదలను చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగింది.. అందుకు కారణం ఏమిటంటే ఈ సినిమాలోని పలు మార్పులు చేసి ఓటీటి లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలుస్తోంది. అందుకోసమే త్వరలోనే ఈ సినిమా అధికారికంగా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లు సమాచారం. థియేటర్లో ప్రేక్షకులను నిరాశపరిచిన ఈ సినిమా ఓటీటి లో మాత్రం పలు మార్పులు చేసి ప్రేక్షకులను మెప్పించాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది చిత్ర బృందం.. అనవసరమైన సన్నివేశాలను తీసేసి సినిమా నిడివిని తగ్గించి మంచి సీన్లతో జోడించి సరికొత్త వెర్షన్తో ఓటీటి లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
సోనీ లీవ్ ద్వారా అన్ని భాషలలో ఈ సినిమా జూన్ 23 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీనిపై ఇంకా ఓటీటి వేదికగా సోని లీవ్ నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన వెలుబడలేదు.కానీ ఈ చిత్రంలో అఖిల్ కి జోడిగా హీరోయిన్ సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రం మీద భారీ నమ్మకం పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది. మరి అన్ని మార్పులతో రాబోతున్న అఖిల్ ఏజెంట్ చిత్రం ఓటీటి లో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.