కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రేమో సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మెప్పించడు శివ కార్తికేయన్. దాని తర్వాత నుండి తన ప్రతి సినిమాను కూడా తెలుగులో డబ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను సైతం ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే గతేడాది ప్రిన్స్ సినిమాతో స్ట్రైట్ తెలుగు సినిమాలో నటించాడు శివ కార్తికేయన్. కానీ ఆ సినిమా మాత్రం ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారాడు. మహావీరుడు ,ఏలియన్ లతోపాటు మరొక సినిమాను కూడా ప్రకటించాడు శివ కార్తికేయన్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు .సినిమాలతో పాటు మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటాడు శివ కార్తికేయన్ .సినిమాలోకి సంబంధించిన అప్డేట్స్ మరియు తన కుటుంబ విషయాలను కూడా తన అభిమానులతో తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటాడు .శివ కార్తికేయన్ స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న శివ కార్తికేయన్ కి ఏమైందో తెలియదు గానీ సడన్గా ట్విట్టర్ కు గుడ్ బై చెప్పడం జరిగింది. తాజాగా తాను ట్విట్టర్ నుండి కొన్ని రోజులు దూరంగా ఉంటున్నాను అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్టును షేర్ చేయడం జరిగిందే .
ఇందులో భాగంగా మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ నేను కొన్ని రోజులు ట్విట్టర్ కు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి త్వరలోనే మళ్లీ వస్తా అంటూ తెలుపుతూ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను తమ టీం ఎప్పటికప్పుడు అందిస్తుందని పేర్కొన్నాడు .వాటితో పాటు ఒక రెండు ఫోటోలు కూడా జత చేసి షేర్ చేశాడు శివ కార్తికేయన్. విమానంలో ట్రావెల్ చేస్తూ దిగిన కొన్ని ఫోటోలను ఆ పోస్టులో షేర్ చేయడం జరిగింది. ఈ క్రమంలోని శివ కార్తికే ఏదైనా వెకేషన్ కి వెళ్ళాడా లేదా షూటింగ్ కోసం కొన్ని రోజులు వేరే దేశానికి వెళ్ళాడా అన్నది మాత్రం తెలియదు. ఏ కారణం లేకుండా ట్విట్టర్ కు గుడ్ బాయ్ చెప్పడంతో తన అభిమానులు అయోమయంలో పడ్డారు. శివ కార్తికే ఎందుకు ఇంత సడన్గా ట్విట్టర్ కి గుడ్ బై చెప్పాడు అన్న విషయం తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..!!