దసరా డైరెక్టర్ తో మెగాస్టార్ మూవీ ఫిక్స్..?

Anilkumar
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' సినిమా ఇటీవల విడుదలై ఇండస్ట్రీ మొత్తం షేక్ చేస్తోంది. నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 30న గ్రాండ్గా విడుదలైంది. ఇక విడుదలైన మొదటి ఆట నుంచి ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. కేవలం వారం రోజుల లోపే ఏకంగా 50 కోట్ల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గాని తెచ్చింది. సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెలా ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాలో అతని టేకింగ్, స్క్రీన్ ప్లే కి ఆడియన్స్ మంత్రముగ్ధులవుతున్నారు. 

ముఖ్యంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. అలాంటి షార్ట్ ని ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ డైరెక్టర్ సినిమాల్లో పెట్టలేదేమో. అలాంటి ఆలోచన వచ్చినందుకు దర్శకుడు శ్రీకాంత్ కి నెటిజన్స్ దగ్గర నుంచి సినీ సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా వేదికగా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే నూతన దర్శకుల టాలెంట్ ని గుర్తించడంలో ఎప్పుడు ముందుండే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చూసి మూవీ టీమ్ మొత్తానికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా దర్శకుడు శ్రీకాంత్ కి ఫోన్ చేసి అతనిపై పొగడ్తల వర్షం కురిపించాడట.

అప్పుడు శ్రీకాంత్ 'నా దగ్గర మీకోసం ఓ మంచి కథ సిద్ధంగా ఉంది అన్నయ్య. మీరు ఛాన్స్ ఇస్తే ఇప్పుడే వచ్చి చెబుతాను' అని అన్నారట. దీంతో మెగాస్టార్ వెంటనే ఇంటికి రమ్మని చెప్పగా.. దర్శకుడు శ్రీకాంత్ అక్కడికి వెళ్లి చిరంజీవికి కథను వినిపించారట. సుమారు మూడు గంటల పాటు శ్రీకాంత్ చెప్పిన కథని చాలా ఓపికగా ఆసక్తిగా విన్నారట మెగాస్టార్. కథ విని వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నామని శ్రీకాంత్ కి చెప్పారట. ప్రస్తుతం మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమా చేస్తున్న చిరంజీవి ఈ సినిమా పూర్తవగానే శ్రీకాంత్ తో తన తదుపరిచిత్రం చేయబోతున్నాడని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు. నాచురల్ స్టార్ నానిని ఊర మాస్ రోల్ లో చూపించిన శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు మెగాస్టార్ ని ఎలాంటి రోల్ లో చూపిస్తాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: