టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అలాగే మెగా డాటర్ శ్రీజ లకు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. అయితే ఈ న్యూస్ తెలుసిన నెటిజన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. సమంత, శ్రీజ ఇద్దరి విడాకులకు ఓ వ్యక్తి కారణం అనే టాక్ వినిపిస్తోంది. అతనే సమంత హెయిర్ స్టైలిస్ట్ ప్రీతం జుగల్కర్ అంటూ ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారుతుంది. గతంలో సమంత ప్రీతం జుకల్కర్ మధ్య ఏదో నడుస్తుందని ఈ రీజన్ తోనే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చారని.. వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి నాగచైతన్య సహించలేక డివోర్స్ ఇచ్చినట్లు గతంలో కొన్ని వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తలపై ప్రీతం కూడా స్పందించి.. అసలు నేను సమంతని అక్క అని పిలుస్తాను, మా రిలేషన్ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం బాలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు కూడా పెట్టాడు. ఈ విషయం కాస్త పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో ప్రీతం జుక్కల్కర్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తో సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరూ ఈ మధ్యకాలంలో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీజ, సమంత విడాకులకు కారణం ప్రీతం జుక్కల్కర్ అంటూ ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రీతం జుక్కల్కర్ వల్లే శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారని అలాగే సమంత, నాగచైతన్య కూడా ఈ వ్యక్తి వల్లే విడిపోయారంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంత నిజమో తెలియదు కానీ సమంత, శ్రీజ ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి ప్రీతం జుక్కల్కర్ అసలైన కారణం అంటూ చెబుతున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలపై ప్రీతం జుక్కల్కర్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. ఇక సమంతా ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం' సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది...!!