త్రివిక్రమ్, మహేష్ మధ్య.. చిచ్చు పెడుతున్న తమన్?

praveen
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి ఓ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు కెరియర్ లో 28వ సినిమా తెరకెక్కుతున్న  ఈ మూవీ పై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇది మూడో సినిమా కావడంతో అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య మంచి ర్యాపో కొనసాగుతూ ఉంటుంది అని చెప్పాలి. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కారణంగా వీరిద్దరి మధ్య చిచ్చు మొదలైనట్లు ఒక టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.

 ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ 30% పూర్తికాగా.. ఇక ఉగాది రోజు ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఫ్యాన్స్ ఊహించినట్లుగానే మహేష్ బాబును త్రివిక్రమ్ కొత్తగా చూపించబోతున్నాడు అన్నది ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదు ఇక ఈ సినిమా కథలో ఒక డిఫరెంట్ పాయింట్ను అటు త్రివిక్రమ్ హైలెట్ చేయబోతున్నాడు అన్న టాక్ తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఉగాది రోజే పోస్టర్ ద్వారా టైటిల్ రివిల్ చేయాలని త్రివిక్రమ్ అనుకున్నాడట. ఇక ఎన్నో రకాల టైటిల్స్ కూడా ఆ మధ్య వార్తల్లో వినిపించాయి.

 ఇదంతా పక్కన పెడితే ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కారణంగా ఏకంగా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయట. తమన్ ఇదివరకే అలా వైకుంఠపురంలో సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న.. త్రివిక్రమ్ మాత్రం ఇక మహేష్ సినిమా విషయంలో తమన్ తో కాస్త ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య తమన్ కారణంగానే గొడవలు జరుగుతున్నట్లు ఒకటాక్ హాట్ టాపిక్ గా మారింది. మూడు నెలల క్రితమే ట్యూన్స్ రెడీ చేయమని త్రివిక్రమ్ చెబితే ఇప్పుడు వరకు తమను ఒకటి ట్యూన్ కూడా సిద్ధం చేయలేదట. అయితే ఈ విషయంపై ఇక మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో బిజీగా ఉండడం కారణంగానే ఇలా జరిగిందట.  అయితే మరికొన్ని రోజుల్లో ట్యూన్స్ రెడీ చేయకపోతే అతని పక్కనపెట్టి మరొకరిని తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: