బాలయ్యతో నటించడానికి భారీ కండీషన్స్ పెడుతున్న కాజల్ అగర్వాల్..?

Anilkumar
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఆరు పదుల వయసున్న బాలయ్య కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అంత పెద్ద హీరో పక్కన హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ఎవరైనా ఓకే చెప్తారు. మరి కొంతమంది హీరోయిన్స్ అయితే ఎప్పుడెప్పుడు బాలయ్య తో నటించే ఛాన్స్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సరిగ్గా ఇదే అవకాశం మన హీరోయిన్ కాజల్ అగర్వాల్ కి వచ్చింది. బాలయ్య చేయబోయే లేటెస్ట్ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వేస్తున్నారు. 

ఇక ఇదిలా ఉంటే కాజల్ మాత్రం బాలయ్య సినిమాలో నటించడానికి భారీ కండిషన్లు పెడుతోందట. ఇంతకీ కాజల్ పెట్టే కండిషన్లు ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటికే కాజల్ ఎన్నో సినిమాల్లో నటించి కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చింది. ఇక అప్పటినుంచి ఇండస్ట్రీకి చాలా రోజులు పాటు దూరంగా ఉండి ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలోనే వరుస అవకాశాలు అలాగే భారీ రెమ్యూనరేషన్ అయితే అందుకుంటుంది. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాలో ఆమెకు చాన్స్ రావడంతో ఇందుకోసం కాజల్ కొన్ని కండిషన్స్ పెడుతుందట.

అవేంటంటే.. సినిమా షూటింగ్ తాను చెప్పిన డేట్స్ లోనే తనకు సంబంధించిన సీన్స్ అన్నిటిని పూర్తి చేయాలట. అలాగే ఎక్స్పోజింగ్, గ్లామర్ షో మాత్రం ఎక్కువగా చేయను అని కరాకండిగా చెప్పేసిందట. అంతేకాదు ఈ సినిమాకి రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమాలో నటిస్తాను అంటూ డిమాండ్ కూడా చేసిందట. మరీ ముఖ్యంగా ప్రమోషన్స్ కి వస్తుందట.. కానీ రావాలంటే ఖచ్చితంగా దానికి స్పెషల్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెబుతుందట. ఈ కండిషన్స్ అన్నింటికీ ఓకే అంటేనే బాలయ్య సినిమాలో హీరోయిన్గా నటిస్తానని చెప్పిందట కాజల్. దీంతో ఈ విషయం తెలిసి చాలామంది కాజల్ పెట్టే కండిషన్లు మామూలుగా లేవుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం కమలహాసన్ తో ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: