బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్న ధనుష్ బ్రదర్స్..!

Divya
సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం సహజం.. కానీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం అంటే చాలా అరుదైన విషయం అని చెప్పాలి. అయితే తాజాగా వీరిద్దరూ హీరోలుగా.. ఒకరు హీరోగా మరొకరు డైరెక్టర్ నుండీ హీరో గా మారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సై అంటున్నారు.. వారు ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అలాగే ఆయన సోదరుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తన సినిమాల ద్వారా ఫిబ్రవరి 17వ తేదీన బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధంగా ఉన్నారు.


తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ కుట్టి సంయుక్త మీనన్ కలిసి నటిస్తున్న చిత్రం సార్.  ఈ సినిమాను తమిళ్లో వాతి పేరిట ఒకేరోజు విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా సోసియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోందని చెప్పవచ్చు.  సమాజంలో విద్యావ్యవస్థ పై జరుగుతున్న అక్రమ దోపిడీ ప్రధాన అంశంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆద్యంతం సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది.  ఎలాగైనా సరే ఈ సినిమాతో ధనుష్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారని చెప్పవచ్చు.

మరొకవైపు ఆయన సోదరుడు సెల్వరాగవన్ కూడా బకాసురన్ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే మొదటిసారి డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ సినిమాలో నటుడిగా మారారు అంతేకాదు ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేయగా ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి ఈ రెండు భారీ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధంగా పోటీ పడబోతున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది. మరి ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: