తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు నందమూరి బాలకృష్ణ.గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక అంతటి బ్లాక్ బస్టర్ సినిమాలను చేసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అలాంటి ఒక్క హిట్ సినిమాలో కూడా నటించకపోవడం గమనార్హం. దీంతో చాలామంది నందమూరి అభిమానులు నాసిరకం సినిమాలో చేస్తూ తన ఇమేజ్ని అంతా పోగొట్టుకున్నాడు బాలకృష్ణ అంటూ చెబుతున్నారు. గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ సరైన సినిమాల్లో నటించకపోవడంతో ఆయన సినిమాలను థియేటర్లలో చూసేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు సినీ అభిమానులు.
అఖండ సినిమా కంటే ముందు బాలయ్య నటించిన సినిమాలు అన్ని కూడా ప్లాప్ లను అందుకున్నాయి. దీంతో చాలామంది బాలకృష్ణ ఇలాంటి సినిమాలు చేస్తే ఆయన కెరియర్ ముగిసినట్టే అని అభిప్రాయపడ్డారు. సరిగ్గా అలాంటి సమయంలోనే అఖండ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నందమూరి బాలకృష్ణ. దాని అనంతరం ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాప్ అబుల్ షో కి పోస్ట్ గా వ్యవహరిస్తూ మరింత గుర్తింపును పొందాడు. ఈ షో కి గాను ఆయన అనుకున్న కాంబినేషన్స్ చాలా క్రేజీగా ఉండడంతో ఈ షో చూసేందుకు చాలా ఆసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేశాడు బాలకృష్ణ.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ అనిల్ రావిపూడి తో ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం బాలకృష్ణ చిన్న కూతురు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆధ్వర్యంలోనే బాలకృష్ణ షో నిర్వహిస్తున్నాడు. ఈ అహో క్రియేటివ్ హెడ్ గా కూడా బాలకృష్ణ చిన్న కూతురే అని తెలుస్తోంది. బాలకృష్ణ కి సంబంధించిన ఏ చిన్న పని అయినా సరే తన కూతురు తేజస్విని దగ్గరుండి చూసుకుంటుందట. అయితే ఇలా ఎప్పటికప్పుడు నందమూరి బాలకృష్ణ తో తోడుగా ఉంటుంది తేజస్విని. దీంతో చాలామంది తన చిన్న కూతురు తనకు తోడు లేకపోయి ఉంటే ఈపాటికి బాలయ్య కెరియర్ మూగిసేది అంటూ అభిప్రాయపడుతున్నారు..!!