బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అలియా భట్. ఈమె నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. దాని అనంతరం చాలా తక్కువ సమయంలోనే అనేకమైన సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. దాంతో అటు బాలీవుడ్ లోనూ ఈమెకి వరుస అవకాశాలు రావడం జరిగింది.ఇక ఈమె త్రిబుల్ ఆర్ సినిమాతో సౌత్ ఆడియన్స్ను కూడా ఎంతగానో మెప్పించింది. దీంతో టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు పొందింది ఆలియా భట్. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అనంతరం ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమా అనంతరం ఆలియా భట్ కి హాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు రావడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇక వరుస సినిమాల అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని అనంతరం ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. ఇక తాజాగా వీరి పాప పేరు 'రాహ' అని కూడా పెట్టారు ఆలియా భట్ దంపతులు. అయితే తాజాగా అలియా భట్ చేతినిండా సినిమాలో ఉన్న టైంలో పెళ్లి చేసుకోవడం దాని అనంతరం పిల్లలు కనడం విషయంలో తను తీసుకున్న నిర్ణయం లో తను ఎప్పటికీ బాధపడడం లేదని తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు అవే అని తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అలియా భట్.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె జీవితంలో తప్పు లేదా ఒప్పో అనేది సహజం.. ఒకరి జీవితంలో ఒకరు చేసే పని మరొకరు చేయాలని లేదు.. నేనెప్పుడూ నాకు నచ్చింది చేస్తాను.. ఎవరు జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోరు..ముందే ప్లాన్ చేసుకోరు.. కేవలం వచ్చిన పరిస్థితులను ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉంటారు.. వరుస అవకాశాలు వస్తున్న సమయంలో పెళ్లి చేసుకోవడం ఒక పాపకు జన్మనివ్వడం నాకు కరెక్ట్ గానే అనిపించింది.. పెళ్లి చేసుకుంటే పిల్లలకు జన్మనిస్తే నేను చేసే పని నేను మానుకుంటాను అని ఎవరు చెప్పారు..? అది ఎప్పటికీ జరగదు. ఎవరు నా గురించి ఎన్ని మాట్లాడినా నేను పట్టించుకోను.. నా జీవితంలో నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం నేను పెళ్లి చేసుకోవడం. దాని అనంతరం నా పాపకు జన్మనివ్వడం అంటూ చెప్పుకొచ్చింది అలియా భట్.!!