సాధారణంగా సినీ సెలబ్రిటీల గురించి తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అందులోనూ వారికి ఇష్టమైన నటీనటుల పర్సనల్ విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఇష్టపడుతుంటారు తమ అభిమానులు.ఇదిలా ఉంటే ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన దంపతులు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. వారు అలా ఆక్టివ్ గా ఉండడం వల్ల లక్షల మంది అభిమానులు వారిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని వార్తలు
సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
అయితే వీరిద్దరికి పెళ్లి అయి ఇప్పటికే 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ వీళ్ళిద్దరికీ పిల్లలు లేకపోవడంపై అనేకమైన ట్రోల్స్ రావడం జరిగింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఉపాసన తల్లి కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అందరూ నోళ్లు మూసుకున్నారు. ఇదిలా ఉంటే ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన దంపతులు పిల్లల విషయంలో ఒక షాకింగ్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు తమకు పుట్టబోయే పిల్లలను సినిమాలకు
పూర్తిగా దూరంగా ఉంచాలి అని సినిమాలకు దూరంగా పెంచాలి అన్నట్లుగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఉత్తమ పిల్లలని చాలా చిన్న వయసులో నుండి సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు దాని అనంతరం హీరోలని చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఆయన భార్య ఉపాసన దంపతులు మాత్రం ఈ విషయంలో చాలా భిన్నంగా ఉన్నారు. తమకు పుట్టబోయే పిల్లలను బాగా చదివించాలి అన్న ఆలోచనలోనే ఉన్నారు అని ...సినిమాలకు మాత్రం దూరంగా ఉంచాలి అన్నట్లుగా భావిస్తున్నట్లు తెలుస్తోంది..!!