ఆ రోజే ట్రైలర్స్ తో కూడా పోటీ పడబోతున్న చిరు - బాలయ్య..!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెకండ్ జనరేషన్ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ,బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎనిమిది సార్లు నేరుగా తమ సినిమాలతో పోటీ పడ్డ వీరిద్దరూ.. ఇతర సందర్భాలలో ఐదుసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డారు. చివరిగా 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో పోటీ పడగా.. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో రంగంలోకి దిగారు.. అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ పోటీ పడడానికి సిద్ధం అవుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ.
ఈ క్రమంలోనే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ఇందులో చిరంజీవి పక్కన కమలహాసన్ కూతురు స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ జత కట్టనుంది.  జనవరి 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి యూఎస్ఏ ప్రీ టికెట్ బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి.  మరొకవైపు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే జరుపబోతున్నామని తెలిపిన చిత్రం యూనిట్ ఈ సినిమా నుంచి ట్రైలర్ ను జనవరి 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.
మరొకవైపు బాలయ్య చిరంజీవికి పోటీగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధం కానున్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాని కూడా బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఇందులో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది . ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  జనవరి 6వ తేదీన ఒంగోలులో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ఆయన చేతుల మీదగానిసినిమా ట్రైలర్ ని కూడా లాంఛ్ చేయబోతున్నారు.  మరి ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: