ఎట్టకేలకు రష్మీకకు సపోర్ట్ గా ఆ స్టార్ హీరో.. ఏమన్నాడంటే..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక వర్సెస్‌ శాండిల్‌ వుడ్‌.. గత కొన్ని రోజులుగా ఈ చర్చ సాగుతూనే ఉంది.ఇక  తన తొలి సినిమా నిర్మాణ సంస్థ గురించి, కన్నడ ఇండస్ట్రీ నుండి రీసెంట్‌గా వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ గురించి ఆమె స్పందన చూసి కన్నడ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు.అయితే  వాళ్లెంత హర్ట్‌ అయ్యారో తెలియదు కానీ.. ఆయా సినిమాలకు సంబంధించిన నటులు ఇంకా ఎక్కువ హర్ట్‌ అయ్యారు. ఇకపోతే ఈ క్రమంలో రష్మిక మందనను రౌండప్‌ చేసి వరుస కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మరోసారి రష్మిక మీద కామెంట్స్‌ చేస్తూ.. కౌంటర్‌ వేస్తున్నారు. ఇక దీంతో ఈ చర్చ ఇంత త్వరగా ఆగేలా అనిపించడం లేదు.

కాగా కన్నడ భామలు చాలామంది టాలీవుడ్‌కి వచ్చి స్టార్‌ హీరోయిన్లు అవుతున్నారు.అయితే  ఈ క్రమంలో రష్మిక కూడా అలానే వచ్చింది.. స్టార్‌ నాయికగా మారింది.  ఆమె ఇక్కడకు వచ్చినప్పటి నుండి శాండిల్‌వుడ్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతూనే ఉన్నారు. ఇక ఆమె కన్నడను విస్మరిస్తోంది అని అంటూన ఉన్నారు. అయితే దానికి ఆజ్యం పోసినట్లు ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో తన తొలి సినిమా 'కిర్రాక్‌ పార్టీ' ప్రొడక్షన్‌ హౌస్‌ పేరును ప్రస్తావించలేదు. రీసెంట్‌ కన్నడ హిట్‌ 'కాంతార' సినిమా చూడలేదు అని చెప్పింది.ఇక  దాని వెనుక కారణాలు ఆమె తొలి రిలేషన్‌ షిప్‌ అని ఎవరికైనా అర్థమైపోతుంది.ఇకపోతే కన్నడ నటుడు కమ్‌ డైరక్టర్‌ రిషబ్‌ శెట్టి.

రష్మిక మీద ఇన్‌డైరెక్ట్‌గా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమెతో వర్క్‌ చేయడానికి ఆసక్తి చూపించలేదు.ఆమె గతంలో తన తొలి సినిమా ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి చెప్పకుండా చేసిన కోట్స్‌ యాక్షన్‌ను ఇమిటేట్‌ చేసేలా రెండు వేళ్లను కోట్స్‌లా పెట్టి 'ఇస్‌ టైప్‌ కే యాక్ట్రెస్‌' అని అన్నాడు. మరోవైపు రిషబ్‌ శెట్టి స్నేహితుడు, నటుడు ప్రమోద్‌ శెట్టి కూడా రష్మిక గురించి మాట్లాడాడు.  తన జీవితాన్ని తాను నిర్మించుకుంది. ఆమె గురించి మాట్లాడటానికి మనమెవరు. అలా మాట్లాడితే చిన్నపిల్లల తత్వంలా ఉంటుంది' అని కామెంట్‌ చేశాడు ప్రమోద్‌ శెట్టి. ఆమె తన సినిమాలతో బిజీగా ఉన్నట్లుంది. అందుకే 'కాంతార' చూడకపోయుండొచ్చు. ఆమెకు కూడా ఆ సినిమా నచ్చుతుంది అని అన్నాడు. ఆమెకు కాస్త స్పేస్‌ ఇవ్వడి. ఆమె జీవితం ఆమెను జీవించుకోనివ్వండి అని అన్నాడు. అక్కడితో ఆగకుండా.. ఎక్కడ జీవితం ప్రారంభించామో.. అక్కడే ఉండాలని లేదు కదా.ఇక  జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలి. కాగా ఇప్పుడు ఆమె ఆ పనే చేస్తుంది అని అన్నాడు ప్రమోద్‌..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: