అఖిల్ ని చూస్తే నలిపేస్తానంటున్న యాంకర్..!!
యాంకర్ విష్ణుప్రియ కు అఖిల్ అంటే విపరీతమైన అభిమానం ఉన్న సంగతి ఎన్నోసార్లు పలు మీడియాలలో తెలియజేసింది. తాజాగా మరొకసారి ఈ ముద్దుగుమ్మ అఖిల్ పైన ఉన్న అభిమానాన్ని చెప్పకనే తెలియజేసింది. జీ తెలుగులో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె యాంకర్ ప్రదీప్ నీ క్రష్ ఎవరు అని అడగగా.. ఏమాత్రం ఆలోచించకుండా అఖిల్ అక్కినేని అంటూ సమాధానం తెలియజేసింది.అయితే అఖిల్ అంటే తనకు ప్రాణం అన్నట్లుగా తెలియజేసింది విష్ణు ప్రియ. అంతేకాకుండా అఖిల్ కనిపిస్తే నలిపివేయాలి అన్నట్లుగా అనిపిస్తుందని తెలియజేసింది దీంతో అక్కడున్న ప్రదీప్ ఒకసారిగా ఆశ్చర్యపోయారు.
అతడిని చూస్తూ ఉండలేను అన్నట్లుగా విష్ణు ప్రియ తన మాటలను చెబుతూ సిగ్గుపడుతూ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఈ విషయం మరొకసారి వైరల్ గా మారుతోంది. దీంతో కొంతమంది ప్రేక్షకుల సైతం నలిపేసే అంత అభిమానం ఉన్న అభిమానిని కలిగి ఉన్నందుకు అఖిల్ భలే అదృష్టవంతుడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరొకసారి అఖిల్ అక్కినేని పై విష్ణు ప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియ కూడా అడపా దడప్ప సినిమాలలో నడుస్తూ ఉన్నది కానీ పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు.