ఇదేం ట్విస్ట్: చైతూ లవర్ కి పెళ్ళయిందా..?

Anilkumar
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్ర పోషించిన శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఇకపోతే గూడచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ చిన్నది తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలావుంటే  తాజాగా ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటుంది.

ఇక  తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులంతా షాక్ అవుతున్నారు.ఇదిలావుంటే ఇక శోభిత పెళ్లి దుస్తుల్లో వరుడుతో ఉన్న తన ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇక తెల్లటి దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది ఈ జంట. అయితే శోభిత ఈ ఫోటోలను దుబాయ్ నుంచి పంచుకోవడంతో నిజంగానే వివాహం అయ్యిందా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.. కానీ ఆమె షేర్ చేసింది.. ఓక్ మ్యాగజైన్ కోసం చేసిన ఒక ఫోటో షూట్.. ఈ కొత్త ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టా ద్వారా షేర్ చేసుకోవడంతో అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది..

అయితే ఈ ఫోటో పై నెటిజన్స్ నుంచి కొన్ని ఆసక్తికర కామెంట్లు కూడా వచ్చాయి..ఇకపోతే కొద్ది సెకండ్ల పాటు నేను అయిపోయానని.. అనుకున్న.. నీ పెళ్లి అయిపోయిందని అనుకొని.. నా గుండె పగిలిపోయింది..ఇక ” అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా తాజాగా నాగచైతన్య తో ఈమె ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ బాగా వినిపించాయి. అంతేకాదు  ఇక శోభిత పుట్టినరోజుకు నాగచైతన్య ప్రత్యేకంగా హాజరయ్యాడని, హైదరాబాద్లో నాగచైతన్య కొత్త ఇంటికి శోభితను కూడా ఆహ్వానించాడు అంటూ ప్రచారం జరిగింది . అయితే మొత్తానికైతే అందులో నిజం లేదని తేలిపోయింది. శోభిత పెళ్లి కూడా ఒక మ్యాగజైన్ కోసమే అన్నట్టు క్లారిటీ కూడా వచ్చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: