మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ గురించి మనకి తెలిసిందే. ఇక మళయాళంలో ప్రేమం సినిమాతో ప్రేక్షకులను అలరించిన అనుపమ అదే సినిమాతో తెలుగు రీమేక్ లో కూడా మెప్పించింది.అంతకుముందే త్రివిక్రం తో అఆ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న అమ్మడి అప్పటి నుంచి తెలుగు ఆడియన్స్ ని ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.ఇక ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే అమ్మడు ఇప్పుడు తన లుక్ మార్చి సర్ ప్రైజ్ చేసింది. అంతేకాదు కెరియర్ లో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అమ్మడు ఈమధ్య వరుస సినిమాలతో దూసుకెళ్తుంది.
ఇక ఇటీవల తన ఎవర్ గ్రీన్ ఎనర్జీతో సినిమాల్లో సత్తా చాటుతున్న అనుపమ ఈమధ్యనే కార్తికేయ 2 హిట్ తో నేషనల్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు అమ్మడికి చేతినిండా సినిమాలు వస్తున్నాయి. కాగా నిఖిల్ తో కార్తికేయ 2 చేయడంతోనే ఈ జోడీ బాగుందని తన నెక్స్ట్ సినిమా 18 పేజెస్ లో కూడా ఆమెని రిపీట్ చేశారు. అంతేకాదు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో కూడా అనుపమ నటిస్తుంది. ఇకపోతే అందులో ఒకటి డీజే టిల్లు సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ కాగా మరొకటి స్టార్ హీరో సినిమా అని తెలుస్తుంది.ఇక దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ తో రౌడీ బోయ్స్ సినిమాలో రెచ్చిపోయి
మరి లిప్ లాక్ చేసిన అనుపమ ఇక మీదట గ్లామర్ రోల్స్ కూడా చేసేందుకు రెడీ అని హింట్ ఇస్తుంది.అయితే ఏం చేసినా ఎలా చేసినా కొన్నాళ్లు హీరోయిన్ గా చకచకా సినిమాలు చేసి సినిమాల నుంచి త్వరగానే రిటైర్ అవ్వాలని నిర్ణయించుకుంది అనుపమ.అయితే సినిమాలే కాదు వెబ్ సీరీస్ లకు ఓకే చెబుతున్న అనుపమ ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ షార్ట్ ఫిల్మ్ లో కూడా సత్తా చాటింది. ఇక అనుపమ స్లిమ్ లుక్ వర్షన్ 2.o గా చెప్పుకుంటున్నారు. ఆమెని మొదటి నుంచి అభిమానిస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఒకప్పటి బొద్దుగా ఉన్న అనుపమనే మాకు కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!