చిరంజీవిని పెళ్లి చేసుకోవడానికి కొట్టుకున్న ఇద్దరు హీరోయిన్లు..?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి గౌరవం ఉందో మనందరికీ తెలిసిందే. ఇక  ఈయన ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన కృషి,పట్టుదల తో ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు.ఇకపోతే చిరంజీవి తర్వాత ఆయన ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే చిరంజీవి గారు మాస్,క్లాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సినిమాల్లో నటించారు. ఈయన నటించిన మాస్ సినిమా ఒకటి ప్రేక్షకుల్లో చాలా ఆదరణ పొందింది.ఇక  ఆ సినిమానే ఇంద్ర.  ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను తిరగరాసింది.

అయితే  ఇంద్ర సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించారు.ఇక వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇంద్ర సినిమాలో హీరోయిన్స్ గా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించారు. అయితే ఇక  వీళ్ళిద్దరూ సినిమా షూటింగ్ జరిగే టైం లో చిరంజీవి గురించి కొట్టుకున్నారట.ఆ విషయాన్ని స్వయంగా చిరంజీవిగారే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.ఇకపోతే  చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కోసం ఇద్దరు హీరోయిన్లు కొట్టుకున్నారు అని చెప్పారు.  విషయంలోకి వెళితే.. ఇద్దరు హీరోయిన్లు చిరంజీవి గురించి కొట్టుకున్నారంటే అది కేవలం సినిమా వరకు మాత్రమే నిజజీవితంలో కాదు.

అయితే  ఇంద్ర సినిమా చివరిలో చిరంజీవి చేతితో తాళి కట్టించుకునే సీన్ లో అవకాశం కోసం ఆర్తి అగర్వాల్,సోనాలి బింద్రే ఇద్దరు చాలా వాదించుకున్నారట.అంతేకాదు నిజానికి ఇంద్ర సినిమా చివరిలో చిరంజీవి ఎవరో ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలనే సీన్ ఉందట.  చివర్లో ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని డైరెక్టర్ ఆలోచిస్తున్న టైంలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే లు ఇద్దరూ ఆ సీన్ లో నన్ను పెట్టండి అంటే నన్ను పెట్టండి అంటూ కొంచెం దెబ్బలాడుకున్నారట.అక్కడే వీరి గొడవ చూస్తున్న చిరంజీవి మొహం తిప్పుకొని దండం పెట్టేసారట.  ఏ హీరోయిన్ కి పెట్టిన ఇంకో హీరోయిన్ ని తక్కువ చేసి చూపించిన వాడినవుతాననే ఉద్దేశంతో డైరెక్టర్ ఏ హీరోయిన్ ని తీసుకోకుండా హీరో ఎవరిని పెళ్లి చేసుకోకుండా జనాల హీరోగా చివర్లో సీన్ ముగించారు. ఆ సినిమా టైంలో చిరంజీవి నా మొగుడు అంటే నా మొగుడు అని దెబ్బలాడుకునే సన్నివేశాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అని చిరంజీవిగారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: