నయనతార పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

Anilkumar
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారగా ఎంతో మంచి గుర్తింపు  సంపాదించుకున్న నయనతార వివాహం తరువాత పెద్ద ఎత్తున వరుస వివాదాలలో చిక్కుకుంటున్నారు.అయితే తాజాగా నయనతార విగ్నేష్ దంపతులు పండంటి కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడంతో అసలు ఈమెకు గర్భవతి కాకుండానే పిల్లలకు ఎలా జన్మనిచ్చారు?ఇకపోతే సరోగసి ద్వారా నాయనతార పిల్లలకు జన్మనిచ్చి ఉంటే సరోగసి వివరాలను బయటపెట్టాలి అంటూ పెద్ద ఎత్తున ఈ విషయం వివాదంగా మారింది.అయితే  ఈ క్రమంలోనే తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ విషయంపై స్పందిస్తూ

 పిల్లల సరోగసి గురించి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.ఇదిలావుంటే ఇక  తాజాగా వీరి విషయంలో ఒక్కొక్క విషయం బయటపడటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అయితే  వీరిద్దరూ ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారట వార్తలు వస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ ని కూడా ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం.అంతేకాదు  వీటితోపాటు తన పిల్లలకు గర్భాన్ని అద్దెగా ఇచ్చిన మహిళ వివరాలను కూడా నయనతార దంపతులు ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది.

ఇక మనదేశంలో చట్ట ప్రకారం పెళ్లి అయిన ఐదు సంవత్సరాల వరకు పిల్లలు కాకపోతేనే సరోగసి విధానం ద్వారా పిల్లలను కనే అవకాశం ఉంది.మన దేశంలో సరోగసి ద్వారా పిల్లలను కనే విషయంలో ఎన్నో నియమ నిబంధనలు ఉండటం చేత నయనతార దంపతులు దుబాయ్ కి చెందిన ఒక మహిళ ద్వారా తన పిల్లలకు జన్మనిచ్చారని, వార్తలు వస్తున్నాయి.ఇక ఇలా తన పిల్లలకు జన్మనిచ్చిన సరోగేట్ మదర్ వివరాలను తమిళనాడు ప్రభుత్వానికి నయనతార దంపతులు సమర్పించారని అయితే తన వివరాలను బయటకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. అయితే ఈ విధంగా ఈ దంపతులిద్దరూ కూడా నిబంధనలను ఉల్లంఘించకుండా సరోగసి ద్వారా తన పిల్లలకు జన్మనిచ్చారని తెలియడంతో వివాదం నుంచి ఈ దంపతులు బయటపడ్డారని సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: