రామ్ చరణ్ సినిమాల్లో ఎన్టీఆర్ కి నచ్చని సినిమా ఏంటో తెలుసా..?

Anilkumar
ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మన టైం బాగో లేకపోయినా.. మనం తీసుకునే తప్పుడు కారణాల చేత అయిన.. కొన్ని సినిమాలు మనం ఊహించినంత స్దాయి హిట్ అందుకోలేవు.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అయితే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనుకోని ..అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు బోలెడు ఉన్నాయి.అయితే  ఈ క్రమంలోనే రామ్ చరణ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుని తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి.. పరమ చెత్త సినిమాగా టాక్ తెచ్చుకుంది .ఇక  ఆ మూవీ మరేంటో కాదు బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో తెరకెక్కిన "ఆరెంజ్".ఇకపోతే 26 నవంబర్ 2010 భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో తోనే పరమ చెత్త టాక్ ను సొంతం చేసుకుంది .ముఖ్యంగా ఈ సినిమాలో కాన్సెప్ట్ జనాలకు అర్థం కాలేదు. ఇక హీరో ఎక్కువ కాలం ప్రేమించడు .  

అంతేకాదు ప్రేమ అనేది ఎక్కువ కాలం ఉండదనేది ఆయన అభిప్రాయం. ఈ పాయింట్ రాంగ్ అంటూ అప్పట్లో పెద్ద సంచలనమే లేపారు జనాలు .ఇక  హారిష్ జయరాజ్ మ్యూజిక్ పరంగా నెట్టుకొచ్చిన సినిమాలో కధ లేకపోవడం ..ఆ కంటెంట్ మెగా హీరో స్థాయికి తగ్గ కథ కాకపోవడంతో సినిమా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది . అయితే మొత్తంగా 32 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ సినిమాను తెరకెక్కిస్తే కనీసం 15 కోట్లు కూడా రాలేదు .. అంత చెత్త డైరెక్షన్ అంటూ జనాలు చెప్పుకొచ్చారు . ఈ సినిమా చాలా మంది మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇక అసలు రాంచరణ్ ఈ సినిమాని ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ అప్పట్లో ఆయనపై మండిపడ్డాడు.  అసలు చరణ్ ఇలాంటి సినిమా ఎలా చూస్ చేసుకున్నాడు అని చరణ్ బెస్ట్ ఫ్రెండ్ అయినా తారక్ కూడా అప్పట్లో మండిపడ్డారట . సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో తారక్ చరణ్ కూడా ఒకరు.

ఇక  అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు ..అని ఎమోషన్స్ ని పంచుకుంటారు.అంతేకాదు  ఎక్కడికి వెళ్లాలన్న కలిసి వెళ్తారు. ఆ విషయాలను బయటకు చెప్పుకోరు.అయితే ఈ క్రమంలోని సినిమా స్టోరీల విషయంలో కూడా హెల్ప్ చేసుకుంటారట . ఈ క్రమంలోనే ఆరంజ్ సినిమా రిలీజ్ అయ్యాక తారక్ "చరణ్ కి ఇలాంటి సినిమా ఎలా యాక్సెప్ట్ చేసావ్.. ఇలాంటి సినిమా జనాలకు నచ్చదు.. ప్రేమ అనేది పవిత్రం.. అది పది కాలాలపాటు ఎప్పుడూ లాంగ్ లాస్టింగ్ గానే ఉండాలి..ఇక  ఇలాంటి చెత్త స్టోరీస్ ని మరోసారి చూస్ చేసుకోవద్దు" అంటూ చరణ్ పై ప్రేమగా కోప్పడ్డారట . ఇక దీంతో చరణ్ కూడా ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను కెరియర్ పరంగా జాగ్రత్తగా ఉంటాను అంటూ తారక్ కు మాటిచ్చారట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్ బొమ్మరిల్లు భాస్కర్ పై మండిపడ్డారు "ఇంత చెత్త సినిమా ఎలా తీసావ్ రా నాయనా,,ఇంతకంటే దరిద్రమైన స్టొరీ మరోకటి ఉండదు" అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: