టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఉంది. అయితే ఇక వీరిద్దరి కాంబినేషన్లో గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి.అది కూడా బాలకృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు `సింహా`, లెజెండ్`, `అఖండ` అనే మూడు సినిమాలతో అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శీను. అందుకే వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది.గత ఏడాది ఇద్దరు కలిసి చేసిన `అఖండ` భారీ సంచలనాన్ని సృష్టించింది.అయితే `అఖండ` సినిమా కరోనా సమయంలో కూడా 75 కోట్లకు పైగా
షేర్ వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరి పోసింది. అతి త్వరలోనే ఈ ఇద్దరూ నాలుగో ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఓ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా తీయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నదని సమాచారం.ఇదిలావుంటే ఇక ప్రెజెంట్ గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా పూర్తి కావొస్తుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు బాలయ్య.అయితే ప్రస్తుతం బోయపాటి యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఆ తరువాత టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రాజెక్టుతో బోయపాటి బిజీ కానున్నాడని సమాచారం. బాలయ్య బోయపాటి కాంబోలో రానున్న నాలుగో సినిమా వచ్చే ఏడాదిలో ద్వితీయార్థంలో షూటింగ్ కి సిద్ధమవుతున్నట్లు న్యూస్ వినిపిస్తుంది.అంతేకాదు వీలైనంత త్వరగా ఈ సినిమా పూర్తి చేసి 2024 వేసవిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. బాలయ్య ఈ పొలిటికల్ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడు అన్నది చూడాలి. ఏదేమైనాప్పటికీ బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే అభిమానులకు పూనకాలు గ్యారంటీ..!!