టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే, ఇక ఈ ఇద్దరి జంట డేటింగ్ చేస్తోంది, అందుకే చాలా సార్లు ముంబైలో కెమరా కంటబడ్డారని మీడియా చాలా సార్లు ప్రూవ్ చేసింది. అయితే గోవాలో న్యూయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు అని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇకపోతే కన్నడ ఇండస్ట్రీకి చెందిన రష్మిక.. 'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈమె మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది.
ఇక దీంతో ఆమెకి పలు సినీ అవకాశాలు వచ్చాయి.ఈమె వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. కాగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా మారింది.ఇక 'పుష్ప' సినిమాతో నేషనల్ వైడ్ క్రష్ గా ఆమె పాపులర్ అయింది.అయితే ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.కాగా 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఇందులో అమితాబ్ కూడా నటించారు.అయితే ఈ సినిమా అక్టోబర్ 7 న రిలీజ్ కు రెడీ అవుతోంది.ఇకపోతే ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి.
అయితే ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ యూట్యూబ్ ఛానెల్ వారు ఒకరు రష్మికను ఇంటర్వూ చేసారు. ఇక అందులో భాగంగా ...విజయ్ దేవరకొండ ప్రస్తావన తెచ్చి..అతని తాజా చిత్రం లైగర్ గురించి అడిగారు.దీనికి రష్మీక మాట్లాడుతూ...తను మాస్ మీవీ లవర్ ని కాబట్టి సినిమా మొత్తం ఎంజాయ్ చేసానని చెప్పింది.అంతేకాదు ముఖ్యంగా విజయ్ యాక్టింగ్ తనకు తెగ నచ్చిందని చెప్పుకొచ్చుంది.ఇక లైగర్ రిలీజ్ తర్వాత అతన్ని కలిసానని చెప్పుకొచ్చింది. అయితే ఆపాత్ర కోసం విజయ్ పడ్డ కష్టం తనని బాగా ఇన్పైర్ చేసిందని చెప్పింది.అంతేకాదు అలాగే ఈ సినిమాలో పాత్ర కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా ఫిజకల్ ట్రాన్సఫర్మ్ అవటం తను చాలా ఇష్టపడ్డానని అంది. ఇక అతన్ని చాలా మెచ్చుకున్నానని చెప్పింది.కాగా రష్మిక మాటలు ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి..!!