టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి మనకి తెలిసిందే. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు ఎన్టీఆర్. రెజీనా, నివేదా థామస్ నటించిన రీసెంట్ మూవీ శాకిని డాకిని. అయితే వచ్చేవారం ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈసినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు మూవీ టీమ్. ఈ ప్రమోషన్లలో భాగంగా రెజీనా, నివేద ఇద్దరూ వరుస ప్రెస్ మీట్లు, వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రెజీనా, నివేద ఇద్దరూ కూడా టాలీవుడ్ యంగ్‌టైగర్ తారక్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఎన్టీఆర్ తో కలిసి లవకుశ సినిమాలో నటించింది నివేద. ఇక ఆయనతో పనిచేసిన అనుభవం ఉండటంతో..
తారక్ గురించి చాలా విషయాలు పంచుకుంది. అయితే ఆయన ఎనర్జీ అద్భుతం అని.. ఎప్పుడు ఎంత పనిచేసినా కూడా అలసిపోవడం అంటూ ఉండదని. ఇకపోతే షూటింగ్ కు వచ్చినప్పుడు ఎంత ప్రెష్ గా ఉంటారో.. ఇంటికెళ్ళేప్పుడు కూడా అలానే ఉంటారంటుంది నివేదా.అయితే తారక్ గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ రెజీనా ఆయన చాలా మంచోడు.. మంచి మనసున్నవాడు అంది. తనను చాలా సార్లు తో అభినందించారు.అంతేకాదు అది చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు రెజీనా. తారక్ మంచి మనసుతోనే పుట్టాడని... కమల్ హాసన్ -.. ఎన్టీఆర్ ఒకేలా ఆలోచిస్తారన్నది రెజీనా.ఇకపోతే నివేదా మాట్లాడుతూ.. తారక్ ను చూసినప్పుడల్లా తనకు చాలా ఉల్లాసంగా ఉంటుందని అంటోంది.
ఆయన మనసు ఎంతో మంచిదంటుంది నివేదా. అయితే ఎన్టీఆర్ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని తనకు చేతనైనంత సాయం చేసేందుకు ముందు ఉంటాడు.. పని విషయంలో ఎంత సీరియస్ గా ఉంటారో.. మామూలు సమయంలో చాలా ఫన్నీగా ఉంటాడని చెప్పింది.ఇక తారక్ ను కమల్ హాసన్ తో పోల్చింది రెజీనా.. ఎన్టీఆర్, కమల్ ఇద్దరూ కూడా చాలా విషయాల్లో ఒకేలా ఉంటారంటోంది హీరోయిన్. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని. అయితే తనతో నటించే అవకాశం వస్తే వదులుకోనంటోంది. ఇక అంత మంచి మనసు ఉన్నోళ్లు చాలా అరుదుగా ఉంటారంటోంది రెజీనా కసాండ్ర.అయితే ఇద్దరు హీరోయిన్లు ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడంతో.. తారక్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అయితే వాళ్లు తారక్ ను పోటీపడి పొగిడిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇకఇండస్ట్రీలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఈ ఇద్దరు తారలు..!!