మెగాస్టార్ అడిగితే మళ్లీ సినిమాలో నటిస్తా.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!!

Anilkumar
తాజాగా ఏపీ మంత్రి ఆర్కే రోజా ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి ఆయన బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పారు.అయితే  నటుడు ఉత్తేజ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని మంత్రి రోజా గుర్తు చేసుకున్నారు.ఇదిలావుంటే ఈ సందర్భంగానే ఆమె తన సినీ రీ ఎంట్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇకపోతే తాను ఇప్పుడు పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నానని, చాలా మంది సినిమాలు చేయాలని అడుగుతున్నారని , కానీ, టైమ్ లేక చేయడం లేదని చెప్పిన రోజా.. చిరంజీవి అడిగితే తప్పకుండా ఆయన సినిమాలో నటిస్తానని తన మనసులో మాట బయటకు చెప్పారు.

ఇకపోతే  చిరంజీవికి బర్త్ డే విషెస్ చెప్పిన అనంతరం ..తను స్కూల్ డేస్ నుంచి చిరంజీవి అభిమానినని పేర్కొంది. అయితే 'ఆలయ శిఖరం' సినిమా షూటింగ్ టైమ్ లో ఆయన వద్దకు వెళ్లి ఆటోగ్రాఫ్ తీసుకున్న సంగతి గుర్తు చేసుకుంది.అయితే తనకు 'ఘరానా మొగుడు' సినిమాలో అవకాశం వచ్చి మిస్ అయిందని, ఆ తర్వాత 'ముఠా మేస్ట్రీ'లో మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేశానని చెప్పింది. ఇకపోతే  ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్స్ చాలా బాగా చేశారని తెలిపిన రోజా..షూటింగ్ లో ఫస్ట్ ఫస్టే 'ఎంత ఘాటు ప్రేమయో' సాంగ్ షూట్ చేశారని గుర్తు చేసుకుంది.

అయితే  ఇక ఆ తర్వాత 'రాజశేఖరా' సాంగ్.. తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పింది.ఇదిలావుంటే 'ముఠా మేస్త్రీ' షూటింగ్ టైమ్‌లో తను భయపడిపోయి వాంప్టింగ్స్ చేసుకున్నానని తెలిపింది.ఇకపోతే  బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతున్నపుడు ఆ ఘటన జరిగిందని వివరించింది.కాగా  చిరంజీవి 'ముఠా మేస్త్రీ' , 'బిగ్ బాస్', 'ముగ్గురు మొనగాళ్లు' చిత్రాల్లో కథానాయికగా రోజా నటించింది.అయితే  రోజా భర్త సెల్వమణి కూడా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: