బిగ్ బాస్ ప్రియులకు గుడ్ న్యూస్.. టెలికాస్ట్ డేట్ లాక్..!!
హిందీ బిగ్ బాస్ కు ఏమాత్రం తగ్గకుండా తెలుగులో బిగ్ బాస్ మంచి విజయాన్ని అందుకుంటుంది కొన్ని ప్రత్యేకమైన ఎపిసోడ్లలో హిందీ బిగ్ బాస్ రేటింగ్ క్రాస్ చేసే విధంగా తెలుగులో చేసిన దాఖలు కూడా ఉన్నట్లు సమాచారం. స్టార్ మా లో టెలికాస్ట్ అయినా 5 సీజన్లు మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా సీజన్ -6 కోసం ప్రేక్షకులతో పాటు ఎంతోమంది కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక గత కొద్ది రోజుల క్రితం బిగ్ బాస్ -6 ప్రోమో ఇటీవలే విడుదలైంది ఆగస్టులో ఈ షో ప్రారంభమవుతుందని అందరూ అనుకున్నారు. అయితే మొన్నటి వరకు ఆగస్టు చివరి ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమయ్యే అవకాశం ఉందని వార్తలు కూడా బాగా వినిపించాయి.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ -6 సెప్టెంబర్ 4వ తారీఖున ప్రారంభం అవుతున్నట్లుగా స్టార్ మా వర్గాల నుంచి సమాచారం తెలుస్తున్నది. ఓటిటి వర్షన్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ వచ్చి ఇప్పటికి ఎన్నో రోజులు కావస్తోంది మొన్నటి వరకు ఆ బిగ్ బాస్ సందడి కూడా బాగా సందడి చేయడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ బిగ్ బాస్ కు ప్రేక్షకులు అప్పుడే సిద్ధమయ్యేలా కనిపిస్తున్నారు. నాగార్జున హోస్టుగా ఈ సీజన్ కు కూడా వ్యవహరించబోతున్నారు. ఇందులో చాలామంది విభిన్నమైన కంటిస్టేన్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటే సోషల్ మీడియాలో టాక్ బాగా వినిపిస్తోంది.
ఇక ఇందులో ముఖ్యంగా ఉదయభాను అత్యధికంగా పారితోషకం తీసుకొనే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొక వారం రోజుల్లో క్వారెంటైన్ కు వెళ్ళబోతున్నట్లు సమాచారం. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు స్టార్ మా వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి వీకెండ్ ఎపిసోడ్ మంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.