మహేష్ కోసం విలన్లుగా ఐదుగురు స్టార్ హీరోలు..?

Anilkumar
ప్రస్తుతం మన సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే హీరోలు విలన్ పాత్రలు చేయడం. ప్రస్తుతం మన టాలీవుడ్ లో కూడా అలాగే జరుగుతోంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఏకంగా ఐదుగురు హీరోలు విలన్స్ గా మారబోతున్న వార్త సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రెండు భారీ చిత్రాలు చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఆ తర్వాత రాజమౌళి తో మరో సినిమా చేస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తన సినిమాకు పార్ధు, అర్జునుడు అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. జూన్ మొదటి వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా లో విలన్ పాత్రలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. 

ఇందులో ఏకంగా ముగ్గురు విలన్స్ ఉండబోతున్నారని సమాచారం. ఇక విలన్స్ గా నటించే ముగ్గురు కూడా హీరోలు కావడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మూడు బలమైన విలన్ పాత్రలను డిజైన్ చేశారట త్రివిక్రమ్. అందుకోసం హీరోలను విలన్ పాత్రలో నటింపచేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విలన్ పాత్రల కోసం సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, ఫాహాద్ పజిల్, పృథ్వీరాజ్ ల తో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. విజయ్ సేతుపతి ఇప్పటికే హీరోగా విలన్గా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా విలన్ గా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పుష్ప సినిమాలో విలన్గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మరోవైపు పృథ్విరాజ్ కూడా హీరోగా విలన్గా రాణిస్తున్నాడు.

ఇదే ముగ్గురు స్టార్ హీరోల ను మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో విలన్స్ గా తీసుకోవాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దర్శకుడు రాజమౌళి సైతం హీరోలను విల్లుగా మార్చబోతున్నాడు. అది కూడా మహేష్ బాబు సినిమా కోసమే. ఇప్పటికే ఈగ సినిమాలో స్టార్ హీరో సుదీప్ విలన్ గా చేశాడు. అటు బాహుబలి లో దగ్గుబాటి రానా ని విలన్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో తమిళ హీరో కార్తీ ని విలన్ పాత్రలో నటింపజేయాలని చూస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం తమిళం నుంచి కార్తి ని అలాగే హిందీ నుంచి మరో హీరో ని విలన్ పాత్ర కోసం రాజమౌళి సంప్రదిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఇలా మహేష్ సినిమా కోసం త్రివిక్రమ్ ఇటు రాజమౌళి ఇద్దర్ ఇద్దరు హీరోలను విలన్స్ గా చూపించపోతున్నట్లు టాలీవుడ్ లో ఒక సరికొత్త చర్చ మొదలైంది. అయితే ఇదంతా పాన్ ఇండియా మార్కెట్ కోసం అని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాల్సిందే...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: