పాపం.. అనుష్కను ఇంకా ఆ సమస్య వెంటాడుతోందా..?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో ఫిట్‌నెస్ ఫ్రీక్ అనిపించుకొన్న బ్యూటీ అనుష్క శెట్టి . ఇక ఈమె నిత్యం యోగా చేసి.. తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచగలిగే ఆమెకు..ఎప్పుడైతే 'సైజ్ జీరో'  అనే సినిమాలో నటించిందో అప్పటి నుంచి కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. అయితే పాత్ర పరంగా ఆ సినిమాలో ఆమె కొన్ని కిలోల వెయిట్ పెరిగింది. ఇకపోతే ఆ తర్వాత దాన్నుంచి బైటికి రావడానికి నానా తంటాలు పడుతోంది. అయితే ఇప్పటికీ స్వీటీని ఆ సమస్య వెంటాడుతునే ఉంది.ఇక  దీని కారణంగా ఈ నెల్లోనే సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఒక సినిమా వాయిదా పడింది. .పి.మహేశ్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కాలి.

కాగా అనుష్క వెయిట్ లాస్ అవ్వాల్సిన కారణంగా సినిమా మరో రెండు నెలలు లేట్ గా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అయితే ఈ సినిమాలో ఆమె నటించాలంటే స్లిమ్‌గా మారాల్సిందే. ఇకపోతే నిజానికి 'సైజు జీరో' తర్వాత నటించిన 'భాగమతి', 'నిశ్శబ్దం' చిత్రాల్లో ఆ ముద్దుగుమ్మ ఎప్పటిలా బొద్దుగుమ్మలానే కనిపించింది.అయితే అనుష్క ఈ సమస్య నుంచి బైటపడడం అంత సులభం కాదు.కాగా  కఠోరమైన కసరత్తులు, దానికి కావల్సిన డైట్ మెయిన్‌టెయిన్ చేయాలి. కాగా అప్పుడే ఆమె కొత్త సినిమాలోని పాత్రకు సరిపోగలదు. అయితే ఆమె కచ్చితంగా మళ్లీ ఫిట్ నెస్ ఫ్రీక్ అనిపించుకుంటుందని నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇదిలావుంటే నిజానికి కొన్నేళ్ళ క్రితం బ్యాక్ పెయిన్ కారణంగా అనుష్క జిమ్ లో ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయలేకపోయింది. ఇక దాంతో ఆస్ట్రేలియాలోని ఓ ఫేమస్ మెడికల్ సెంటర్ లో నేచురోపతిక్ ట్రీట్ మెంట్ తీసుకుంది. అయినా కూడా ఇప్పటికీ ఆ సమస్య తీరకపోవడంతో .. మళ్ళీ ఆర్గానిక్ ట్రీట్‌మెంట్‌నే ఆశ్రయించబోతోంది. ఇకపోతే మరి మరో రెండు నెలల్లో స్వీటీ ఎప్పటిలాగానే స్లిమ్ గా మారి కొత్త సినిమాకి రెడీ అవుతుందేమో చూడాలి.అయితే  నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఆ సినిమాకి 'మిసెస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' అనే టైటిల్ ఖాయం చేసినట్టు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: