టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వయసులో కూడా యువ హీరోలకు షాక్ ఇస్తూ భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు మెగాస్టార్. ఇప్పటికే ఈయన చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి.ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా సినిమా "ఆచార్య". అయితే ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఇదిలావుండగా తాజాగా ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు ఎలాంటి రీషూట్ చేయాలని చేయలేదని, అంతేకాదు వచ్చిన అవుట్పుట్ తో కొరటాల శివ బాగా సాటిస్ఫై అయ్యారని..
అందుకే ఎలాంటి రీషూట్ ప్లాన్ చేయలేదని పుకార్లు వినిపించాయి.ఇదిలావుంటే ఇక తాజాగా ఈ పుకార్లు పై రియాక్ట్ అయ్యారు కొరటాల శివ. అయితే ఎలాంటి సినిమాకైనా ఔట్ పుట్ బాగుండాలంటే రీషూట్ కూడా అవసరం అని, ఒకటి రెండు సన్నివేశాలు రీ షూట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు అని అన్నారు కొరటాల శివ.ఇకపోతే "ఒక సన్నివేశం బాగాలేదని అనిపిస్తే, ఆ సన్నివేశాన్ని బాగా చేయటం కోసమే మనం రీషూట్ చేస్తాము. ఇకపోతే ఎందుకంటే చివరికి సినిమా తీసేది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటం కోసం మాత్రమే.అంతేకాదు వాళ్లు ఎంటర్టైన్ అవుతారు అనుకున్నప్పుడు ఒక సన్నివేశాన్ని రీషూట్ చేయటం తప్పేం కాదు" అని చెప్పిన కొరటాల శివ
..
"ఆచార్య" సినిమా కోసం కూడా కొన్ని సీన్లు రీషూట్ చేసినట్లు తెలపడం జరిగింది.అయితే ఈ సినిమాని నిర్మిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నారు. ఇకపోతే చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ లు గా కనిపించనున్నారు.ఏప్రిల్ 29న విడుదల కాబోతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సమర్పణలో మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్..!!