రాజమౌళి తో సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్ హీరో..!

Anilkumar
కన్నడ స్టార్ హీరోయిన్స్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అయితే అప్పటి దాక కన్నడ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితమైన కన్నడ హీరో యశ్ క్రేజ్ "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడింది .ఇకపోతే ఇప్పుడు ప్రతీ రాష్ట్రంలోనూ యశ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే ఇక కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమాతో బిజీగా ఉన్న యశ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు జవాబు ఇవ్వడం జరిగింది. ఇక అసలు విషయం ఏంటంటే రాజమౌళితో సినిమా యశ్ సినిమా చేసే అవకాశం ఉందా అని అడగగా యశ్ తనకి కూడా రాజమౌళి తో కలిసి పనిచేయాలని ఉంది అని క్లారిటీ ఇచ్చారు.

ఇకపోతే "ఆ విషయం డైరెక్టర్ మాత్రమే చెప్పాలి.ఇక  రాజమౌళి గారికి ఒక విజన్ ఉంది. అయితే ఆయనకు ఉన్న స్పెసిఫికేషన్స్ కి నేను సెట్ అవుతాను అనుకుంటే నన్ను సంప్రదిస్తారు.ఇకపోతే కథ నచ్చితే నేను కచ్చితంగా ఆయనతో సినిమా చేస్తాను" అని అన్నారు యశ్. అయితే మరి రాజమౌళితో యశ్ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.ఇదిలావుండగా  ఇక మరోవైపు ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు రాజమౌళి. అంతేకాదు త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఇటీవల త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్లో మహేష్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించాడు రాజమౌళి. ఆఫ్రికన్ అడ్వెంచర్ నేపథ్యంలో మహేష్బాబుతో సినిమా ఉండబోతోందని.. సుమారు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు మహేష్ బాబు సినిమా కథ మీద కసరత్తు చేయబోతున్నాడు రాజమౌళి. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కథకు సంబంధించి తుది మెరుగులు దిగుతున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: