ముంబై లో 'ఆర్ ఆర్ ఆర్' గ్రాండ్ పార్టీ.. గెస్ట్ గా ఆ స్టార్ హీరో..?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా సినిమా ఆర్ఆర్ఆర్. బిగ్గెస్ట్ మల్టిస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించడం జరిగింది.ఈ సినిమా చూసి అభిమానులతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ఈ ఇద్దరి హీరోల నటనకు ఫిదా అయ్యారు.ఇక ప్రెసెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా నిపిస్తుంది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ఇంకా దూసుకు పోతుంది.కాగా  మన దేశంలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టి ఆర్ ఆర్ ఆర్ పవర్ చూపించింది.

అయితే ఇంత అద్భుతమైన హిట్ అందుకున్న నేపథ్యంలో టీమ్ అంతా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయినా అన్ని ఏరియాల్లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇక సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో త్రిబుల్ ఆర్ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ ను చేసుకుంటోంది. ఇక టాలీవుడ్ కి చెందిన అగ్ర నిర్మాత దిల్ రాజు తాజాగా త్రిబుల్ ఆర్ చిత్ర యూనిట్ కి గ్రాండ్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో మన రాజమౌళి నాటు నాటు పాటకు డాన్స్ కూడా వేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రాబట్టింది.

ఇక  అటు నార్త్ లో కూడా దాదాపు 200 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో పెన్ స్టూడియోస్ జయంతిలాల్ గడ బుధవారం ముంబై లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.ఇకపోతే  ఈ పార్టీకి బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గెస్ట్ గా హాజరవుతారని సమాచారం వినిపిస్తుంది.అంతేకాదు అలాగే పెన్ స్టూడియోస్ ఈ ఈవెంట్ లో రాజమౌళి తో పాటుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లను కూడా సత్కరిస్తారని తెలుస్తుంది.అయితే  ఈ పార్టీ కోసం రాజమౌళి బృందం ఈ రోజు ముంబై చేరుకోనుంది తెలుస్తుంది.ఇకపోతే  రామ్ చరణ్ ప్రెసెంట్ ఆర్సీ 15 సినిమా షూటింగ్ కోసం అమృత్ సర్ వెళ్లగా అక్కడి నుండే ఈయన నేరుగా పార్టీకి హాజరవ్వనున్నారని తెలుస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: