వామ్మో : ఆ స్టార్స్ కోసం ఎదురు చూస్తున్న చిరంజీవి కారణం..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..  మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి ఒక ప్రత్యేకమైన యూనిక్ పీస్ అని చెప్పవచ్చు.. ఆయన పేరు.. ఆయన కటౌట్ .. ఆయన వాయిస్ ఓవర్.. ఆయన గెస్ట్ రోల్ ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే ఆయన లో ఉన్న ప్రతి లక్షణం కూడా సినిమా స్థాయిని పెంచగలదు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.. చిరంజీవి నోటి నుంచి ఒక సినిమా పేరు వచ్చిందంటే చాలు ఆ సినిమాకు పెద్ద ఎత్తున పాపులారిటీ దక్కుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇంతటి ఇమేజ్ ని సంపాదించుకున్న చిరంజీవి ఇతర స్టార్ సెలబ్రిటీల పై ఆధారపడడం వినడానికి చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. ఆచార్య సినిమాను మొదలుకొని ఆయన చేస్తున్న మూడు సినిమాల వరకు ఇతర స్టార్ సెలబ్రిటీల పై ఆధారపడడం ఆయన అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే కాదు కొంచెం గిల్టీగా కూడా అనిపిస్తోంది. ముఖ్యంగా ఆచార్య సినిమా విషయానికి వస్తే తనతోపాటు తన కొడుకు రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటింప చేశాడు. విన్నవారంతా తండ్రికి కొడుకు తో నటించాలనే కోరిక ఉంటుంది కదా అంటూ సర్ది పెట్టుకున్నారు.

మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమాను  తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇందులో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు. చిరంజీవి ముంబై కి వెళ్లి అక్కడ వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. చిరంజీవి మీద ఉన్న అభిమానంతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించడానికి ఒక రూపాయి కూడా తీసుకోకపోవడం గమనార్హం.
 ఈ సినిమా తర్వాత భోళా శంకర్ సినిమాలో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు.
ఇక వాల్తేరు వీర్రాజు సినిమాలో కూడా రవితేజ కీలక పాత్రలో నటించబోతున్నారు.
వీరి తోపాటు చిరు సినిమాలో పూరి జగన్నాథ్ కూడా నటించబోతున్నారు అనే విషయాన్ని స్వయానా పూరి జగన్నాథ్ వెల్లడించడం ప్రస్తుతం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే ఏ సినిమాలో నటించబోతున్నాడు అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: