NBK107: ఫ్యాన్స్ కి బాలయ్య బిగ్ సర్ప్రైజ్.. ఎప్పుడంటే..?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరోలతో సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.NBK107 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాని అగ్ర నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా భారీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ విడుదలై ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఉగాదికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ను రిలవీల్ చేయనున్నారు. ఇక ఇది ఫ్యాన్స్ కిక్కిచ్చే అప్డేట్ అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు జై బాలయ్య, వేటపాలెం అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు వేటపాలెం టైటిల్ అయితే బాగుంటుందని భావించారు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో తండ్రీ, కొడుకులుగా బాలయ్య కనిపిస్తాడని సమాచారం. ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ అంటుంది.

ఇక కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మైనింగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో కొనసాగుతుంది. సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో కన్నడ అగ్రనటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. అలాగే లేడీ పవర్ఫుల్ పాత్రలో ప్రముఖ తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు.అఖండ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ముందు అనుకున్న దాని కంటే మరో 30 కోట్ల బడ్జెట్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: